BREAKING
ఏకగ్రీవ సర్పంచును అభినందించిన ఎమ్మెల్యే కాకర్ల కావలి చైర్‌పర్సన్ పీఠానికి 18 మంది పోటీ.. 21 నామినేషన్లు దాఖలు రజక సోదరుడిపై దాడి ఘటనపై సంఘం ఆగ్రహం.. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబుతో కమిషనర్ ప్రమీల భేటీ : నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కీలక చర్చ దిశ మార్చుకున్న అక్వాన్‌ తుఫాన్‌.. ప్రతిష్టాత్మక స్వచ్ఛ అవార్డు ప్రోత్సాహకం అందుకున్న కార్పొరేషన్ సోమశిలలో సాయంత్రం వేళ ఆవుల బెడద.. పట్టించుకోని అధికారులు! రాందాస్ కాలనీలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నమ్ముకున్న పార్టీలు న్యాయం చేయలేదు ఎంపీపీ ఎన్నికల విప్ నియామక పత్రాన్ని ఎంపీడీవోకు అందజేసిన మన్నారపు రవికుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన సీఈవో --నిర్మాణ పనులు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సంజీవ్ హోరా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యల ఘనంగా వైస్ చైర్మన్ నవీన్ అన్నకి బర్త్‌డే వేడుకలు జిల్లా స్థాయి క్విజ్‌లో నకరికల్లు విద్యార్థిని ప్రతిభ ప్రథమ స్థానం సాధించిన కె. రిషిత శ్రీకరి నామినేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

ఘనంగా వైస్ చైర్మన్ నవీన్ అన్నకి బర్త్‌డే వేడుకలు

Select Suryaa Now
ఘనంగా వైస్ చైర్మన్  నవీన్ అన్నకి బర్త్‌డే వేడుకలు

 

ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : ఏదులాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ జన్మదిన వేడుకలు సాయి ప్రభాత్‌నగర్-2లో అంబరాన్నంటాయి. తమ అభిమాన నాయకుడి పుట్టినరోజును పురస్కరించుకుని కాలనీవాసులు రచ్చబండ వద్ద ప్రత్యేకంగా వేడుకలు ఏర్పాటు చేసి ఘనంగా జన్మదిన సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్‌ను ఆహ్వానించి ఆయన చేత కేక్ కట్ చేయించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం పూలమాలలు, శుభాకాంక్షలతో ముంచెత్తుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

నవీన్ రాకతో రచ్చబండ పరిసరాలు సందడిగా మారాయి. అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేక్ కట్ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటూ తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. నవీన్ నాయకత్వం, ప్రజలతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కాలనీవాసులు ఆనందోత్సాహాల మధ్య వేడుకలను నిర్వహించారు.

రచ్చబండ వద్ద కేక్ కట్ నుంచి బాణసంచా సందడి వరకు ప్రతి ఘట్టం ఉత్సాహభరితంగా సాగింది. నవీన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు స్థానికులు పోటీపడటంతో సాయి ప్రభాత్‌నగర్-2లో పండుగ వాతావరణం నెలకొంది. అభిమానుల మధ్య నవీన్ జన్మదిన వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమం లో కౌన్సెలర్లు మహేష్, ప్రసాద్, దివ్య, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.