BREAKING
మండల ప్రజలతో 40 ఏళ్ళ అనుబంధం..గ్రామం అభివృద్ధి కొరకే సర్పంచ్ బరిలో నిలిచా: వేణుగోపాల్ రావు స్థానిక గ్రంథాలయ అభివృద్ధికి ప్రణాళికలు. చైర్మన్ వడ్డే వెంకట్ పూతలపట్టు సర్పంచ్ బరిలో గుంటూరు మురళి వర్గం దూకుడు మలయాళంలో కల్ట్ మూవీకి సీక్వెల్, అమల్ నీరద్ దర్శకత్వంలో సలీమ్ కుమార్ కుమారుడికి కీలక అవకాశం ఈనెల 21న కౌన్సిల్ సమావేశం సామాజిక అభివృద్ధికి గ్రీన్ కో సంస్థ చేయూత రిజిస్టర్ స్థలంలోనే దారి వివాదం.. పనులు చేసుకోనివ్వకుండా అడ్డంకులు! కనీస వేతనం 42000 ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి ఏకగ్రీవ సర్పంచును అభినందించిన ఎమ్మెల్యే కాకర్ల కావలి చైర్‌పర్సన్ పీఠానికి 18 మంది పోటీ.. 21 నామినేషన్లు దాఖలు రజక సోదరుడిపై దాడి ఘటనపై సంఘం ఆగ్రహం.. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబుతో కమిషనర్ ప్రమీల భేటీ : నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కీలక చర్చ దిశ మార్చుకున్న అక్వాన్‌ తుఫాన్‌.. ప్రతిష్టాత్మక స్వచ్ఛ అవార్డు ప్రోత్సాహకం అందుకున్న కార్పొరేషన్ సోమశిలలో సాయంత్రం వేళ ఆవుల బెడద.. పట్టించుకోని అధికారులు!

ఎంపీపీ ఎన్నికల విప్ నియామక పత్రాన్ని ఎంపీడీవోకు అందజేసిన మన్నారపు రవికుమార్ యాదవ్

Select Suryaa Now
ఎంపీపీ ఎన్నికల విప్ నియామక పత్రాన్ని ఎంపీడీవోకు అందజేసిన మన్నారపు రవికుమార్ యాదవ్

సైదాపురం, మేజర్ న్యూస్ :  సైదాపురం మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విప్‌గా నియమితులైన మండల పార్టీ అధ్యక్షులు మన్నారపు రవికుమార్ యాదవ్, తన నియామకానికి సంబంధించిన అధికారిక పత్రాన్ని మంగళవారం సైదాపురం మండల ఎంపీడీవో ఎం.వి. మోహన్ రెడ్డికి అందజేశారు.  వైఎస్సార్‌సీపీ ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ నెల 17వ తేదీన మన్నారపు రవికుమార్ యాదవ్‌ను పార్టీ విప్‌గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీడీవోకు నియామక పత్రాన్ని అందజేసి, మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ విప్‌గా తనకు బాధ్యతలు అప్పగించిన విషయాన్ని అధికారికంగా తెలియజేశారు.  మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియలో పార్టీ ఆదేశాలు, విప్ నిబంధనల అమలుకు సంబంధించి ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామంతో సైదాపురం మండల రాజకీయ వర్గాల్లో ఎంపీపీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి మండల అధ్యక్షులు మన్నారపు రవికుమార్ యాదవ్ నూతన ఎంపీటీసీ గా ఎన్నికైన కుంచం సుబ్బయ్య మండల నాయకులు కొండాపు మోహన్ రావు ఆవుల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు