మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబుతో కమిషనర్ ప్రమీల భేటీ : నూతన కౌన్సిల్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కీలక చర్చ
మదనపల్లె టౌన్, మేజర్ న్యూస్ : మదనపల్లె మున్సిపల్ కమిషనర్ కె. ప్రమీల నూతన మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబును ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా చైర్మన్‌గా ఎన్నికైన శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం త్వరలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణ,ఏర్పాట్లు,మున్సిపల్ పరిపాలనకు సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించారు.పట్టణ అభివృద్ధి,ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించే దిశగా సమన్వయంతో ముందుకు సాగడంపై కూడా చర్చించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ మదనపల్లి పట్టణ అభివృద్ధిపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా,కమిషనర్ ప్రమీలతో కలిసి క్లీన్ మదనపల్లె లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి