ప్రతిష్టాత్మక స్వచ్ఛ అవార్డు ప్రోత్సాహకం అందుకున్న కార్పొరేషన్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : స్వచ్ఛ అవార్డు ప్రోత్సాహకం నగదును కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ , రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు నగరపాలక సంస్థకు అందజేసిందని కమిషనర్ వై.ఓ నందన్ కార్పొరేషన్ కార్యాలయం కమిషనర్ ఛాంబర్ లో మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో నెల్లూరు నగరం రాష్ట్రస్థాయిలో సరికొత్త రికార్డు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ – 2026 ఫలితాల్లో నెల్లూరు నగరపాలక సంస్థ మూడు సాధారణ అవార్డులతో పాటు వాయు నాణ్యత పరిరక్షణ విభాగంలో నగదు బహుమతితో కూడిన ప్రత్యేక అవార్డును కైవసం చేసుకున్న సందర్భంగా ప్రకటించిన ప్రోత్సాహక నగదు మొత్తం పది లక్షల రూపాయలు అందుకున్నామని కమిషనర్ ప్రకటించారు. స్వచ్ఛ అవార్డులను రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్లో గతంలో అందుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ, అందుకు సహకరించిన పారిశుద్ధ్య సిబ్బంది, అధికారుల సమన్వయం, ప్రజల భాగస్వామ్యాన్ని కమిషనర్ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో "స్వచ్ఛమైన నెల్లూరు – ఆరోగ్యకరమైన నెల్లూరు" లక్ష్యంతో నగర రూపురేఖలను మరిన్ని పర్యావరణహిత మార్పులతో తీర్చిదిద్దుతామని కమిషనర్ హర్షం వ్యక్తం చేశారు.