ఏకగ్రీవ సర్పంచును అభినందించిన ఎమ్మెల్యే కాకర్ల
ఉదయగిరి, మేజర్ న్యూస్ : మండలంలోని గండిపాళెం పంచాయతీ ప్రజల మద్దతుతో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎంపికైన గుంటుపల్లిమాలకొండయ్యచౌదరిని మంగళవారం వింజమూరు టీడీపీ ప్రధాన కార్యాలయం లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అభి నందించారు. గ్రామంలో ఐక్యమత్యానికి, అభివృద్ధి ఆకాంక్షకు ఈ ఏకగ్రీవ ఎన్నిక నిదర్శనంగా నిలిచిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే సూచిం చారు ఆనంతరం ఎమ్మెల్యేను సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండిపాళెం జలాశయ చైర్మన్ అడుసుమల్లి వెంకటసుబ్బయ్య, మాజీ ఎంపీటీసీ పాముల రమణయ్య, మాజీ జలాశయ చైర్మన్ సుంకర సత్యం. మాజీ ఉప సర్పంచ్ రెడ్డిబత్తిన నరసింహారావు, టీడీపీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.