కనీస వేతనం 42000 ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం 42,000 ఇవ్వాలని, పెన్షన్ ,పిఎఫ్, గ్రాట్యుటీ వంటి సామాజిక భద్రత సౌకర్యాలు తోపాటు ,అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో డిసెంబర్ 1 ,2 ,3 తేదీలలో ఢిల్లీలో జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.నెల్లూరు రూరల్ పరిధిలోని కోనేరు మార్కెట్ నందు, సిఐటియు కోనేరు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రూరల్ అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్, కే. పెంచల నరసయ్య మాట్లాడుతూ.... కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 42000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల భద్రత వారి సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు .అంతేకాకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మార్చి ,నాలుగు లేబర్ కోడ్స్ తీసుకుని రావడం వలన కార్మికులను కట్టు బానిసలుగా మార్చే పరిస్థితి వచ్చింది. నాలుగు లేబర్ కోడ్స్ ని వెంటనే రద్దు చేయాలని, ఈ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1,2,3 తేదీలలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా లో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, సిఐటియు ఉపాధ్యక్షులు కొండా ప్రసాద్, సిఐటియు నాయకులు సురేష్, గిరి ,మోహన్, రాజా , భరత్, గంగరాజు, కోటి తదితరులు పాల్గొన్నారు.