BREAKING
అడవి ఆముదం గింజలు తిని 10 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం MLC మీర్జా రహమత్ బేగ్ బ్లాక్‌మెయిల్ కేసులో కీలక పరిణామం.. సల్మాన్ ఖాన్ అరెస్ట్, రిమాండ్ పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల పూతలపట్టులో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అట్టహాసంగా 'అష్టదిగ్గజాలు' కవి సమ్మేళనం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్ అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రముఖ మలయాళ గాయని రిమి టోమి రెండో వివాహం, జిమ్ ట్రైనర్ లిబిన్ మాత్యుతో వైభవంగా పెళ్లి ఇంకొల్లు మండలంలో చివరి రోజు సర్పంచ్‌, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు దాఖలు ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోలాహలంగా రాచానుపల్లి వైసీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్ ఇంట్లోనే మద్యం దుకాణమా.. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమా? అంధకారంలో పూతలపట్టు మండలంలోని వైఎస్ఆర్ కాలనీలు వీధి దీపాలు లేక ప్రజల నరకయాతన చీకట్లో విషపురుగుల భయం.. పట్టించుకోని అధికారులు పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి విద్యార్థినికి ఎమ్మెల్యే సన్మానం

అంధకారంలో పూతలపట్టు మండలంలోని వైఎస్ఆర్ కాలనీలు వీధి దీపాలు లేక ప్రజల నరకయాతన చీకట్లో విషపురుగుల భయం.. పట్టించుకోని అధికారులు

Select Suryaa Now
అంధకారంలో పూతలపట్టు మండలంలోని వైఎస్ఆర్ కాలనీలు   వీధి దీపాలు లేక ప్రజల నరకయాతన  చీకట్లో విషపురుగుల భయం.. పట్టించుకోని అధికారులు

​పూతలపట్టు మేజర్ న్యూస్ 

మండలంలోని వైఎస్ఆర్ కాలనీలలో సరిపడా వీధి దీపాలు లేకపోవడంతో కాలనీవాసులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతూ నరకయాతన అనుభవిస్తున్నారు పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరినప్పటికీ, కనీస మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండటంతో కాలనీలన్నీ సమస్యల నిలయాలుగా మారాయి ఒక్కో కాలనీలో సుమారు 10 నుండి 20 వరకు విద్యుత్ స్తంభాలు (పోల్స్) ఉన్నప్పటికీ, వాటిలో కేవలం రెండు మూడు స్తంభాలకు మాత్రమే లైట్లు వెలుగుతుండటం గమనార్హం మిగిలిన స్తంభాలకు లైట్లు లేకపోవడంతో పాటు మరికొన్ని చోట్ల అసలు విద్యుత్ స్తంభాలే లేకపోవడంతో సాయంత్రం ఆరు గంటలు దాటిందంటే చాలు వైఎస్ఆర్ కాలనీలన్నీ చిమ్మచీకటిలో మునిగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్న ఆ కొద్దిపాటి లైట్లు కూడా సరిగా వెలగకపోవడంతో రాత్రి సమయాల్లో ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయపడిపోతున్నారని కాలనీ వాసులు చెబుతున్నారు 

​ఇదిలా ఉండగా, కాలనీల పరిసరాల్లో పిచ్చిమొక్కలు, తుప్పలు భారీగా పెరిగి ఉండటంతో చీకటి మాటున పాములు, తేళ్లు, మండ్రగబ్బలు వంటి విషపురుగులు సంచరిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. రాత్రి వేళల్లో ఏ క్షణాన ఏ విషపురుగు ఇళ్లలోకి చొరబడుతుందో, ఎవరిని కాటు వేస్తుందోనని మహిళలు, వృద్ధులు, చిన్నారులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది అత్యవసర పనుల నిమిత్తం, అనారోగ్య సమస్యల కారణంగా రాత్రి పూట ఆసుపత్రికి వెళ్లాలన్నా చీకట్లో దారి కనిపించక తీవ్ర అవస్థలు పడుతున్నామని,

​మరోవైపు, రాత్రి వేళల్లో వీధులు అంధకారంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు, అసాంఘిక శక్తులు సంచరించే ప్రమాదం ఉందని కాలనీవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు రోజంతా కష్టపడి పనుల నిమిత్తం బయటకు వెళ్లి రాత్రి సమయాల్లో ఇళ్లకు తిరిగి వచ్చే ఉద్యోగులు, దినసరి కూలీలు, ట్యూషన్లకు వెళ్లి వచ్చే విద్యార్థులు చీకట్లో నడవలేక నానా అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు చీకట్లో రహదారిపై ఉన్న గుంతలు, కంకర రాళ్లు కనిపించక అదుపుతప్పి కిందపడి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి కనీస మౌలిక సదుపాయాలైన వీధి దీపాల ఏర్పాటుపై పలుమార్లు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్ శాఖ సిబ్బంది, దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు అందించినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు అధికారులు ఇప్పటికైనా మండల స్థాయి ఉన్నతాధికారులు, పంచాయతీ కార్యదర్శులు తక్షణమే స్పందించి వైఎస్ఆర్ కాలనీలలో స్వయంగా పర్యటించాలని, అన్ని స్తంభాలకు కొత్తగా ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు స్తంభాలు లేని చోట కొత్తవి వేసి తమకు చీకటి కష్టాల నుండి విముక్తి కలిగించాలని కాలనీవాసులు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు.

పూతలపట్టు రిపోర్టర్ దిలీప్ కుమార్