అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
గాజువాక, మేజర్ న్యూస్: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దువ్వాడ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నగర సీపీ, డీసీపీ (క్రైమ్స్), ఏడీసీపీ ఆదేశాల మేరకు క్రైమ్స్ జోన్-2 ఏసీపీ వెంకటరావు, సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ బ్రాంచ్ సీఐ జి.డి. బాబు పర్యవేక్షణలో స్థానిక గ్లోరియా స్కూల్లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపాల్ సిస్టర్ సెలీనా సహకారంతో జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సమాజంలో పోలీసుల పాత్ర, కమ్యూనిటీ పోలీసింగ్, సైబర్ భద్రత-నేరాల నివారణ, ట్రాఫిక్ నిర్వహణ-రోడ్డు భద్రత తదితర అంశాలపై విద్యార్థులు వ్యాసాలు రాశారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని, నేరాల నియంత్రణలో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో దువ్వాడ క్రైమ్ ఎస్ఐ జి. సత్తిబాబు, ఏఎస్ఐ శ్రీనివాసరావు, హెచ్‌సీ డి. సురేష్ కుమార్, కానిస్టేబుళ్లు ఆర్. రమేష్, జోగి నాయుడు, పైలా నాయుడు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : పీ.కోటిరెడ్డి, గాజువాక ఇంచార్జ్, విశాఖపట్నం