BREAKING
లలితకళా ఉత్సవం కోసం బాల కుటీర్ నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఆహ్వానం ఉత్తమ ఉపాధ్యాయులకు యుటిఎఫ్ సన్మానం పకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలి పూతలపట్టు సీఐ తిమ్మయ్య అయ్యప్ప దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన మండల పూజలు నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి అండగా ఉంటాం. ఎమ్మెల్యే అమిలినేని. అడవి ఆముదం గింజలు తిని 10 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం MLC మీర్జా రహమత్ బేగ్ బ్లాక్‌మెయిల్ కేసులో కీలక పరిణామం.. సల్మాన్ ఖాన్ అరెస్ట్, రిమాండ్ పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల పూతలపట్టులో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అట్టహాసంగా 'అష్టదిగ్గజాలు' కవి సమ్మేళనం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్ అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రముఖ మలయాళ గాయని రిమి టోమి రెండో వివాహం, జిమ్ ట్రైనర్ లిబిన్ మాత్యుతో వైభవంగా పెళ్లి

అయ్యప్ప దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన మండల పూజలు

Select Suryaa Now
అయ్యప్ప దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన మండల పూజలు

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ : 
నెల్లూరు వేదాయపాలెం వేద శాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో మంగళవారం కేరళ సాంప్రదాయ కార్తీకమాస మండల పూజలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. తొలుత ఉదయం అయ్యప్ప స్వామికి పాలాభిషేకం, గణపతి హోమం, ఉష పూజ, శ్రీ ఫెయిలై ఉత్సవం, కలశపూజ, నవకాభిషేకం ఉత్సవం నిర్వహించారు. సాయంత్రం మహాదీపారాధన, భగవతి సేవ, పడిపూజ, అత్తల పూజ, శ్రీ వేలి ఉత్సవం, పడి కర్పూరం, హరిహరాసనం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
ఆలయ చైర్మన్ గూడాల శేషగిరిరావు, కార్యదర్శి, కోశాధికారి గడ్డం రత్తయ్య పర్యవేక్షణలో ఈ వేడుకలు జరిగాయి. మండల పూజలకు ఊటుకూరు శ్రీనివాస్ రెడ్డి, శైలజ దంపతులు, ఊటుకూరు సత్యనారాయణరెడ్డి, మాలిని దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. పడిపూజకు కాటంరెడ్డి మహిధర్ రెడ్డి, జ్యోతి దంపతులు సేవలు అందించారు.
అన్నదాన కార్యక్రమానికి లలిత జువెలరీస్ అధినేత కిరణ్ కుమార్ జైన్, కారంపూడి నాగరాజా, నీరజ దంపతులు, వెంకటేశ్వర్లు, పద్మ దంపతులు, సునీల్ రెడ్డి, భారతి దంపతులు, మురళీకృష్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేతలు సుబ్బారావు, సత్యలక్ష్మి దంపతులు, మురళీకృష్ణ, సరిత దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విజయకుమార్, ముగ్గుల మురళీమోహన్ రెడ్డి, పావల్ల ప్రసాద్, పసుపులేటి అశోక్ చంద్ర, పలువురు అయ్యప్పలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.