పకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంపెరవలి మండలం ముక్కామల యినప కోళ్ల రాఘవరావు మెమోరియల్ శాఖ గ్రంధాలయంలో మంగళవారం జాతీయ గ్రంథాలయ వారోత్సవముల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సెమినార్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు కొంపెల్ల పట్టాభిరామం జిల్లా గ్రంథాలయ సంస్థ రిటైర్డ్ కార్యదర్శి ముళ్లపూడి బుల్లచ్చన్న లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధికమిటీ సభ్యులు మోటిపల్లి శ్రీరామమూర్తి ఎస్ వి వి సూర్యనారాయణ కేదారశెట్టి రత్నరావు పాతూరి వెంకటేశ్వరరావు అక్కిన రాఘవులు హైస్కూల్ ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎస్ పద్మ హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు కే గంగాధరం లు హాజరై ప్రసంగించారు. ఉపాధ్యాయురాలు ఎస్ పద్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థి దశ నుండి ప్రకృతి ప్రేమికులుగా మారాలని ప్రకృతిని మనం రక్షిస్తేమనల్ని రక్షిస్తుందని పాడు చేస్తే శిక్షిస్తుందని దానికి ఉదాహరణ ఇటీవల సంబంధించినటువంటి ఆకస్మిక వర్షాలు,వరదలు తుఫానులు ఒక ప్రదేశంలో అతివృష్టి మరొక ప్రదేశంలో అనావృష్టిగా తయారవుతుందని దీనివల్ల మానవాళి జీవనం ప్రశ్నార్థకమవుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రకృతి ప్రేమికులుగా మారాలని అన్నారు.
కొంపల్ల పట్టాభిరామం మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి మనం ఎలా అయితే ప్రవర్తిస్తామో ఆ విధమైనటువంటి గుర్తింపు ఎదిగిన తర్వాత కూడా లభిస్తుందని కాబట్టి వ్యక్తిగత ప్రవర్తన క్రమశిక్షణతో ఉండాలని తెలియజేయడం జరిగింది.
రిసోర్స్ పర్సన్ శ్రీమతి ఎన్ పుష్పవతి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి పని టెక్నాలజీ మీద ఆధారపడుతుందని కావున ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి దశనుండే టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలని అన్నారు.