డబుల్ రిజిస్ట్రేషన్ తో వినుకొండలో మరదలి ఆస్తినే కాజేసి చేసిన బావ కుటుంబ
గుంటూరు : వినుకొండ పట్టణంలో అక్రమ భూ కబ్జా వ్యవహారం సంచలనం రేపుతోంది. సొంత కుటుంబ సభ్యుల ఆస్తినే కబ్జా చేసిన ఘటనపై బాధితులు న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.బాధితులు జె.ఏడుకొండలు - జోరిగే రమాదేవి దంపతుల కథనం ప్రకారం... వారికి చెందిన 1/25 సెంట్ల భూమిని వారి మరిది జోరిగే శ్రీనివాసరావు, అతని భార్య జోరిగే సుభాషిని అక్రమంగా కబ్జా చేశారు. అధికారులను మేనేజ్ చేసి, ఒకే డాక్యుమెంట్ నెంబర్ 392 మీద రెండు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపణ. ఒక ఆస్తికి రెండుసార్లు రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనే దానిపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పాత్రపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మా సొంత ఆస్తిని, మా బావ కబ్జా చేశాడు. రెవెన్యూ రికార్డుల్లో మా పేరు ఉన్నా, అక్రమ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రార్ పై కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు పూర్తి వివరాలు విచారించి మాకు న్యాయం చేయాలి" అని ఏడుకొండలు, రమాదేవి దంపతులు వాపోతున్నారు. 392 సర్వేనెంబర్ డాక్యుమెంట్ కు సంబంధించిన అసలు రికార్డులను బయటకు తీయాలి.రిజిస్ట్రార్ పాత్రపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలిబాధితుల ఆస్తిని తిరిగి వారికి అప్పగించాలి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఆర్డీవో, వినుకొండ సబ్ రిజిస్ట్రార్ స్పందించి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
సూర్య నాయక్