BREAKING
శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి తేప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. డబుల్ రిజిస్ట్రేషన్ తో వినుకొండలో మరదలి ఆస్తినే కాజేసి చేసిన బావ కుటుంబ కందుకూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సి నాగమణి నామినేషన్ లలితకళా ఉత్సవం కోసం బాల కుటీర్ నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఆహ్వానం ఉత్తమ ఉపాధ్యాయులకు యుటిఎఫ్ సన్మానం పకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలి పూతలపట్టు సీఐ తిమ్మయ్య అయ్యప్ప దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన మండల పూజలు నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి అండగా ఉంటాం. ఎమ్మెల్యే అమిలినేని. అడవి ఆముదం గింజలు తిని 10 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం MLC మీర్జా రహమత్ బేగ్ బ్లాక్‌మెయిల్ కేసులో కీలక పరిణామం.. సల్మాన్ ఖాన్ అరెస్ట్, రిమాండ్ పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల పూతలపట్టులో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అట్టహాసంగా 'అష్టదిగ్గజాలు' కవి సమ్మేళనం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ

లలితకళా ఉత్సవం కోసం బాల కుటీర్ నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఆహ్వానం

Select Suryaa Now
లలితకళా ఉత్సవం కోసం బాల కుటీర్ నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఆహ్వానం

 

 Lగుంటూరు: లలితకళలను ప్రోత్సహించడం కోసం బాల కుటీర్ గత 31 సంవత్సరాలుగా సంస్థ వ్యవస్థాపకులలో ఒకరైన గరిగె ప్రభావతి స్మృతి దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన లలిత కళా ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. వివిధ లలిత కళల్లో ప్రతిభావంతులైన బాలలకు "ప్రతిభా పల్లవం" పురస్కారాన్ని, ఎంపిక చేసిన బాల సాహితీ సృజనకర్తలకు "మంగాదేవి బాలసాహిత్య పురస్కారాన్ని", బాల సేవా తత్పరులకు "మంగాదేవి విశిష్ట సేవా పురస్కారాన్ని”, మహిళాభ్యున్నతికి విశేష సేవలందిస్తున్న వారికి "మాలతీ ప్రమదా పురస్కారాన్ని" అందజేసి సత్కరిస్తోంది.ఈ సందర్భంగా బాలల సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించడానికి రాష్ట్రస్థాయిలో వివిధ పోటీలను నిర్వహిస్తోంది. విద్యార్థులను, గురువులను ఆయా పోటీల   పాల్గొనేలా ప్రోత్సహించవలసినదిగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు బాల కుటీర్  వ్యవస్థాప కురాలు డాక్టర్ నన్నపనేని మంగాదేవి విజ్ఞప్తి చేశారు. చిత్రలేఖనం, కాగితపు బొమ్మలు, కథా రచన, కవితా రచన, లేఖా రచనలలో పోటీలు నవంబరు 23 వ తేదీన మూడు వేదికలలో అనగా శ్రీ వెంకటేశ్వర బాల కుటీర్, మూడవ లైన్, శ్యామల నగర్ నందు, చేతన ఛారిటబుల్ ట్రస్ట్, చౌడవరం నందు, హిందీ ప్రేమి మండలి మహావిద్యాలయ ప్రాంగణం, నాజరు పేట తెనాలి నందు నిర్వహిస్తున్నామని పాఠశాలలు తమకు అనుకూలమైన ఏదైనా ఒక వేదికలో తమ విద్యార్థులను పాల్గొనేలా ప్రోత్సహించవలసినదిగా ఆమె తెలియజేశారు. గాత్రము, వాద్య సంగీతంలో వ్యక్తిగతంగాను, బృందగానాల రూపంలోనూ పోటీలు డిసెంబరు 10 న శ్రీ వెంకటేశ్వర బాల కుటీర్, మూడవ లైన్, శ్యామల నగర్, గుంటూరు నందు జరుగుతాయని ఆమె తెలియజేశారు. విజేతలందరికీ సర్వోత్తమ, విశిష్టోత్తమ, ఉత్తమ వ్యక్తిగత నగదు బహుమతులు ఉంటాయని, బృందగానాల పోటీలలో సర్వోత్తమ, విశిష్టోత్తమ, ఉత్తమ స్థానాలలో నిలిచిన బృందాలకు బహుమతుల క్రింద ఒక్కొక్క బృందానికి 5 వేలు, 4వేలు, 3 వేల రూపాయల బహుమతులు, గురువులకు 4 వేలు, 3 వేలు, 2 వేల రూపాయల బహుమతులు ఉంటాయని ఆమె తెలియజేశారు. పోటీదారులు నవంబరు 18 లోగా ఆన్లైన్ లో మాత్రమే వారి పేర్లను రిజిస్టరు చేసుకోవలసి ఉంటుంది. నవంబరు 23, డిసెంబర్ 10 తేదీలలో నిర్వహించబడే వివిధ పోటీల వివరాలను 0863-2232405, 9390115480, 9390115487 నంబర్లకు ఫోన్ చేసి కనుగొనవచ్చు. ఇతర వివరాలు, రిజిస్ట్రేషన్ ఫారం స్కూల్ వెబ్ సైట్ www.svbk.in లో పొందవచ్చని డా. మంగాదేవి తెలియజేశారు.

సూర్య నాయక్