BREAKING
లలితకళా ఉత్సవం కోసం బాల కుటీర్ నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఆహ్వానం ఉత్తమ ఉపాధ్యాయులకు యుటిఎఫ్ సన్మానం పకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలి పూతలపట్టు సీఐ తిమ్మయ్య అయ్యప్ప దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన మండల పూజలు నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి అండగా ఉంటాం. ఎమ్మెల్యే అమిలినేని. అడవి ఆముదం గింజలు తిని 10 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం MLC మీర్జా రహమత్ బేగ్ బ్లాక్‌మెయిల్ కేసులో కీలక పరిణామం.. సల్మాన్ ఖాన్ అరెస్ట్, రిమాండ్ పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల పూతలపట్టులో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అట్టహాసంగా 'అష్టదిగ్గజాలు' కవి సమ్మేళనం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్ అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రముఖ మలయాళ గాయని రిమి టోమి రెండో వివాహం, జిమ్ ట్రైనర్ లిబిన్ మాత్యుతో వైభవంగా పెళ్లి

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలపై  ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు

అమరావతి, మేజర్‌న్యూస్ :

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అసాంఘిక శక్తులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ దాడులు, అల్లర్లకు పాల్పడుతున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు.ఈ మేరకు టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లికార్జున, ఐజీ రాజకుమారిలను కలిసి సమగ్ర లిఖితపూర్వక ఫిర్యాదుతో పాటు ఆధారాలను అందజేశారు.ఎమ్మెల్సీ వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ,  టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ ఎస్. రాజశేఖర్‌లతో కూడిన బృందం ఎన్నికల కమిషన్ అధికారులను కలిసింది.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ శ్రేణులు కడప, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ దాడులకు పాల్పడుతున్నాయని టీడీపీ బృందం పేర్కొంది. గుంటూరు జైలులో ఉన్న లేళ్ల అప్పిరెడ్డిని పరామర్శించేందుకు వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు సుమారు 500 నుండి 600 మంది అనుచరులను వెంటబెట్టుకుని వెళ్లడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో తెలిపారు.నామినేషన్ చెల్లదని తిరస్కరించినందుకు ఆగ్రహంతో మాజీ ఎమ్మెల్యే రామ్ ప్రతాప్ రెడ్డి, పిచ్చిరెడ్డి అనే వ్యక్తి అందరూ చూస్తుండగానే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) చెంపపై కొట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఎస్ఈసీకి అందజేశారు.  బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.అనంతరం మీడియాతో ఎమ్మెల్సీ వర్ల రామయ్య మాట్లాడుతూ..పంచాయతీ ఎన్నికల పోరు ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ అరాచకాలు, అసాంఘిక శక్తుల ఆటలు మితిమీరిపోతున్నాయని,వీటికి తోడు పోలీసు వ్యవస్థ నిర్లిప్తత ప్రస్ఫుటంగా కనిపిస్తోందని ఆరోపించారు. నిన్న కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలంలో జరిగిన పార్టీ సమావేశానికి హాజరై బొలెరో వాహనంలో ఇంటికి తిరిగి వెళ్తున్న టీడీపీ మండల స్థాయి ముఖ్య నాయకుడిపై వైసీపీ శ్రేణులు హత్యాయత్నానికి పాల్పడ్డాయి. హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెంబడించి వాహనాన్ని అడ్డుకోగా, అప్పటికే అక్కడ మాటువేసిన 10-15 మంది కర్రలు, కత్తులు, ఐరన్ రాడ్లతో దాడి చేశారు. మా నాయకుడు అప్రమత్తమై పారిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆ దుండగులు బొలెరో వాహనానికి నిప్పు పెట్టి పూర్తిగా తగలబెట్టారు. పులివెందులలో ఓడిపోయామన్న దుగ్ధ, అసూయతోనే జగన్ ఈ దాడులు చేయిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాను.గుంటూరు జైలులో ఉన్న లేళ్ళ అప్పిరెడ్డిని పరామర్శించేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు 500-600 మందిని వెంటబెట్టుకుని వెళ్లడం దారుణం. ముగ్గురికే అనుమతి ఉందని పోలీసులు అడ్డుకున్నా లెక్కచేయకుండా గేటు తోసుకుని లోపలికి వెళ్లారు. ఈ తోపులాటలో ఒక ఎస్సై కాలు విరిగింది. అడుగడుగునా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని జగన్ తన పార్టీ నేతలకు ఆదేశాలిచ్చారా?నామినేషన్ చెల్లదని తిరస్కరించినందుకు మాజీ ఎమ్మెల్యే రామ్ ప్రతాప్ రెడ్డి, పిచ్చిరెడ్డి అనే వ్యక్తి అందరూ చూస్తుండగానే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) చెంపపై కొట్టారు. అక్కడే ఉన్న పోలీస్ అధికారి కుర్చీలో నిద్రపోతూ నిర్లిప్తంగా వ్యవహరించడం సిగ్గుచేటు. చట్టబద్ధంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులపైనే దాడులు చేస్తారా? అన్నమయ్య జిల్లాలో నామినేషన్ వేయడానికి వెళ్తున్న మా పార్టీ అభ్యర్థుల వాహనాలను మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సమక్షంలోనే కర్రలు, రాళ్లతో ధ్వంసం చేశారు. స్వయంగా ఆయనే ఉండి దాడి చేయమని ప్రోత్సహించారు. మీరే దాడులు చేసి, మీరే వాహనాలు తగలబెట్టి తిరిగి టీడీపీపై నిందలు వేస్తూ ఎన్నికల కమిషన్ వద్దకు వచ్చి నంగనాచి కబుర్లు చెబుతున్నారు. దమ్ముంటే ఎక్కడ, ఏ సమయానికి మీ నామినేషన్లను టీడీపీ నేతలు అడ్డుకున్నారో చెప్పాలి.రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలన్నింటిపై సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు, ఐజీ రాజ్ కుమార్ గారికి వివరించాము. వేంపల్లి దాడి కేసులో పట్టుబడిన వారితో పాటు మిగిలిన నిందితులందరినీ అరెస్ట్ చేసి, హత్యాయత్నం కింద జ్యుడీషియల్ కస్టడీకి పంపాలి. ఆర్వోపై చేయి చేసుకున్న రామ్ ప్రతాప్ రెడ్డిని, జైలు వద్ద పోలీసు అధికారి గాయపడటానికి కారణమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము.ఇలాంటి దౌర్జన్యాలకు తెలుగుదేశం పార్టీ భయపడదని, రానున్న పంచాయతీ ఎన్నికలతో పాటు మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలోనూ టీడీపీ కూటమే ఘనవిజయం సాధిస్తుందని, వైసీపీకి శృంగభంగం తప్పదని ఎమ్మెల్సీ వర్ల రామయ్య స్పష్టం చేశారు.