ఉత్తమ ఉపాధ్యాయులకు యుటిఎఫ్ సన్మానం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంవిద్యారంగంలో విశేష సేవలు అందిస్తూ ఇటీవల జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులను యుటిఎఫ్ సంఘం ఘనంగా సన్మానించింది. కడియం మండలం వేమగిరి ఉన్నత విద్యా పాఠశాలలో నిర్వహించిన యుటిఎఫ్ నూతన మండల కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన కడియం ఉన్నత విద్యా పాఠశాలకు చెందిన రవిశంకర్, పొట్టిలంక ఉన్నత విద్యా పాఠశాలకు చెందిన సుజాత, చైతన్యనగర్ ఉన్నత విద్యా పాఠశాలకు చెందిన ఏసుబాబు, కడియం నంబర్-1 ప్రాథమిక పాఠశాలకు చెందిన టి.వి.ఏ. గాయత్రిలను యుటిఎఫ్ నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు బోధనలో అంకితభావం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో విధులు నిర్వహిస్తూ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషి విద్యార్థుల భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందని, ఇటువంటి పురస్కారాలు మరింత బాధ్యతతో పనిచేసేందుకు స్ఫూర్తినిస్తాయని అన్నారు.
యుటిఎఫ్ నూతన మండల కౌన్సిల్ సమావేశం సందర్భంగా నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం ఉపాధ్యాయుల్లో ఆనందోత్సాహాలను నింపింది. అవార్డు గ్రహీతలకు పలువురు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.