ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలి పూతలపట్టు సీఐ తిమ్మయ్య
పూతలపట్టు మేజర్ న్యూస్
మండలంలోని పంటపల్లి, తిమ్మిరెడ్డిపల్లి గ్రామాల్లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి ఇందులో భాగంగానే పూతలపట్టు సీఐ తిమ్మయ్య తన సిబ్బందితో కలిసి ఆయా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద, గ్రామస్థుల సమక్షంలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామాల్లోని మహిళలు, యువకులు, వృద్ధులు, స్థానిక పెద్దలతో సీఐ తిమ్మయ్య ముఖాముఖి సమావేశమయ్యారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరి ఓటు హక్కు ఎంతో పవిత్రమైనదని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఓటరు పాత్ర అత్యంత కీలకమని ఆయన వివరించారు ఏ ఒక్కరూ కూడా డబ్బు, మద్యం లేదా ఇతరత్రా ప్రలోభాలకు లొంగిపోయి తమ అమూల్యమైన ఓటును అమ్ముకోవద్దని హితవు పలికారు ఎలాంటి భయాందోళనలకు, బెదిరింపులకు తావులేకుండా ప్రజలందరూ స్వేచ్ఛాయత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ భరోసా కల్పించారు ఒకవేళ ఎవరైనా అభ్యర్థులు, వ్యక్తులు ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించినా, ప్రలోభాలకు గురిచేసినా, లేదా బెదిరింపులకు పాల్పడినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు అలాంటి వారిపై ఎలాంటి మొహమాటం లేకుండా అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని, గ్రామాలలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగానికి ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని కోరారు ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక సీఐ తిమ్మయ్య పోలీస్ సిబ్బందితో పాటు పంటపల్లి, తిమ్మిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
పూతలపట్టు రిపోర్టర్ దిలీప్ కుమార్