BREAKING
యాసంగిలో వరి సాగు వద్దు! - ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి - జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గ్యాస్ పైప్‌లైన్ పనులు వేగవంతం చేయాలి మార్చి 2028 నాటికి పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు యువతలో ప్రతిభను వెలికితీయడమే యువజనోత్సవాల లక్ష్యం. అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు రెవిన్యూ విభాగంలోని పెండింగ్ఆర్జీలను వారంలోపు పరిష్కరించాలి: నగర కమిషనర్ ప్రేమతో జూనియర్ల హృదయాలను గెలుచుకోవాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తరలింపు శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి తేప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. డబుల్ రిజిస్ట్రేషన్ తో వినుకొండలో మరదలి ఆస్తినే కాజేసి చేసిన బావ కుటుంబ కందుకూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సి నాగమణి నామినేషన్ లలితకళా ఉత్సవం కోసం బాల కుటీర్ నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఆహ్వానం ఉత్తమ ఉపాధ్యాయులకు యుటిఎఫ్ సన్మానం పకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలి పూతలపట్టు సీఐ తిమ్మయ్య అయ్యప్ప దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన మండల పూజలు

ప్రేమతో జూనియర్ల హృదయాలను గెలుచుకోవాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి

Select Suryaa Now
ప్రేమతో జూనియర్ల హృదయాలను గెలుచుకోవాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి

గుంటూరు :సరదా కోసం చేసే ర్యాగింగ్, మాదకద్రవ్యాల అలవాటు విద్యార్థుల బంగారు భవిష్యత్తుపై మాయని మచ్చగా మిగిలిపోతాయని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి. సాయి కల్యాణ చక్రవర్తి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు వైద్య కళాశాలలోని జింఖానా హాల్‌లో విద్యార్థులకు 'ర్యాగింగ్, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు' అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. ఇళ్లు, కుటుంబాలను వదిలి కొత్తగా కళాశాలకు వచ్చే మొదటి సంవత్సరం విద్యార్థులు కొంత ఆందోళనతో ఉంటారని, వారిని సొంత కుటుంబ సభ్యుల్లా ఆదరించాలని సూచించారు. ముఖ్యంగా హాస్టళ్లలో ఉండే జూనియర్లకు ఎక్కువ ప్రేమ, శ్రద్ధ అవసరమని, వారితో ఆప్యాయంగా మాట్లాడి భద్రతా భావం కల్పించాలన్నారు. సీనియారిటీ ప్రదర్శించడం మాని, ప్రేమతో ఎదుటివారి హృదయాలను గెలుచుకోవాలని హితవు పలికారు. క్యాంపస్ దాటి బయటకు వెళ్ళాక సీనియారిటీ ఉండదని, కేవలం ప్రతిభ ఆధారంగానే రాణించగలరని తెలిపారు. వైద్య విద్యార్థులకు డోపమైన్, హార్మోన్లు, నార్కోటిక్స్ గురించి బాగా తెలుసని, మీరు జీవితంలోని క్షణాలను ఆస్వాదించాలి తప్ప డ్రగ్స్ మిమ్మల్ని ఆస్వాదించకూడదని న్యాయమూర్తి పేర్కొన్నారు. మాదకద్రవ్యాలను కలిగి ఉన్నా, సేవించినా, రవాణా చేసినా కఠిన శిక్షలు ఉంటాయని, బెయిల్ కూడా దొరకదని హెచ్చరించారు. అంతేకాకుండా, అవసరం లేకపోయినా యాంటీబయా టిక్స్‌ను విపరీతంగా వాడటం కూడా డ్రగ్ అబ్యూస్ కిందకే వస్తుందని, భవిష్యత్ వైద్యులుగా దీనిపై ఆలోచించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ.. 2009 యూజీసీ, నిబంధనల ప్రకారం ర్యాగింగ్‌కు చాలా విస్తృతమైన అర్థం ఉందన్నారు. జూనియర్లను శారీరకంగా హింసించడమే కాకుండా మాటలు, చేతలు, సోషల్ మీడియా ద్వారా అవమానించడం, అసైన్‌మెంట్లు రాయించుకోవడం, డబ్బులు డిమాండ్ చేయడం కూడా ర్యాగింగ్ కిందకే వస్తాయన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ర్యాగింగ్‌పై ఫిర్యాదు అందితే 24 గంటల్లోపు కళాశాల అధిపతి పోలీసులకు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించాలని, బాధ్యులైన విద్యార్థులను కళాశాల నుండి సస్పెండ్ లేదా శాశ్వతంగా బహిష్కరిస్తారని స్పష్టం చేశారు.డ్రగ్ రహిత భారతదేశం కోసం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ  తీసుకొచ్చిన 'డాన్'  స్కీమ్ 2025 గురించి కార్యదర్శి వివరించారు. జిల్లా స్థాయిలో ఏర్పాటైన ఈ యూనిట్ల ద్వారా మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించడంతో పాటు బాధితులను గుర్తించి వారికి న్యాయ సహాయం, డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా చికిత్స, పునరావాసం కల్పిస్తామన్నారు. డ్రగ్ రహిత సమాజ నిర్మాణంలో వైద్యులు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, జీజీహెచ్ సూపరింటెండెంట్, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

 

సూర్య నాయక్