రెవిన్యూ విభాగంలోని పెండింగ్ఆర్జీలను వారంలోపు పరిష్కరించాలి: నగర కమిషనర్
గుంటూరు : రెవిన్యూ విభాగానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న వివిధ సేవలకు సంబంధించిన ఆర్జీలను వారంలోపు పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హాల్లో రెవెన్యూ అధికారులు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం నందు తొలుత ఆర్ఐ ల వారీగా రెవిన్యూ, విఎల్టీ కలెక్షన్ల వివరాలను అడిగి తెలుసుకొని, కలెక్షన్లు తక్కువగా ఉన్న ఆర్ఐ లు కలెక్షన్లు పెంచాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రెవిన్యూ విభాగానికి సంబంధించి ప్రజల నుండి వచ్చే సర్విస్ రిక్వెస్ట్ లు (మ్యుటేషన్, న్యూ టాక్స్, విఎల్టీ) వంటి వాటిని ఎటువంటి ఆలస్యం లేకుండా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. రెవిన్యూ సేవల్లో జాప్యం వహిస్తే అందుకు బాద్యులైన వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల నుండి వచ్చే దరఖాస్తులు అన్నీ ఆన్ లైన్ లో తప్పనిసరిగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఆక్యుపెన్సీ పొందిన అపార్ట్మెంట్లలో అన్ని ప్లాట్లకు టాక్స్ విధించినదీలేనిడీ తనిఖీలు చేసి, నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ షాప్ ల బకాయిలను కూడా నూరు శాతం వసూలు చేయాలని, లీజు ముగిసిన షాప్ లకు ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే ఆక్షన్ నిర్వహించి షాపులను కేటాయించాలన్నారు. రెవిన్యూ సేవలకు సబంధించి ప్రజల నుండి వచ్చే పిర్యాదులు, సేవలను ఎటువంటి కారణం లేకుండా రిజెక్ట్ చేస్తే సంబంధిత రెవిన్యూ ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకొనుట జరుగుతుందని ఆర్.ఐ లను హెచ్చరించారు. నగరంలో వి.యల్.టి, నూత ట్యాక్స్ కు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులు పరిశీలించి, నిబంధనల ప్రకారం టాక్స్ విధించాలని, అలాగే సబ్ రిజిస్టార్ ఆఫీస్ నుండి వచ్చే దరఖాస్తులను రిజెక్ట్ చేయకుండా అన్నిటికి టాక్స్ విధించాలని, ఇప్పటివరకు రిజెక్ట్ చేసిన దరఖాస్తులను కూడా పరిశీలించి, వెంటనే టాక్స్ విధించాలని ఆర్ఐ లను ఆదేశించారు. నగరంలో నూతన టాక్స్ లు విధించాల్సిన అపార్ట్మెంట్లు, లే అవుట్లకు అన్నిటికి నిబంధనల ప్రకారం టాక్స్ విధించాలని, వాటిలో ఎటువంటి తప్పులు లేకుండా అధికారులు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో అదనపు కమిషనర్లు ఐ.కిషోర్, రవీంద్ర బాబు, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, జి.సాంబశివరావు, సూపరింటెండెంట్ రవికిరణ్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
సూర్య నాయక్