BREAKING
భూభారతి పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి ప్రజల భాగస్వామ్యంతో భూ రీ సర్వే పూర్తి చేయాలి ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం: జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు దివ్యాంగుడికి ఉచితంగా మూడు చక్రాల వాహనం అందజేసిన చైర్‌పర్సన్ గడ్డం అనన్య ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం: జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు యాసంగిలో వరి సాగు వద్దు! - ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి - జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గ్యాస్ పైప్‌లైన్ పనులు వేగవంతం చేయాలి మార్చి 2028 నాటికి పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు యువతలో ప్రతిభను వెలికితీయడమే యువజనోత్సవాల లక్ష్యం. అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు రెవిన్యూ విభాగంలోని పెండింగ్ఆర్జీలను వారంలోపు పరిష్కరించాలి: నగర కమిషనర్ ప్రేమతో జూనియర్ల హృదయాలను గెలుచుకోవాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తరలింపు శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి తేప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. డబుల్ రిజిస్ట్రేషన్ తో వినుకొండలో మరదలి ఆస్తినే కాజేసి చేసిన బావ కుటుంబ కందుకూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సి నాగమణి నామినేషన్ లలితకళా ఉత్సవం కోసం బాల కుటీర్ నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఆహ్వానం

యాసంగిలో వరి సాగు వద్దు! - ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి - జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

Select Suryaa Now
యాసంగిలో వరి సాగు వద్దు!  - ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి  - జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

 

సూర్య - పెద్దపల్లి: యాసంగి సీజన్‌లో జిల్లాలో వరి సాగు పూర్తిగా నష్టదాయకమని, రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగు వైపు మళ్లాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో యాసంగి సాగు ప్రణాళికపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో భూగర్భ జలమట్టాలు తగ్గిపోవడంతో పాటు ఎస్సారెస్పీలోనూ నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, సాగునీరు విడుదల చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీరు తాగునీటి అవసరాలకే సరిపోతుందన్నారు.రైతులు వరికి బదులుగా మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలు సాగు చేసేలా గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఒక ఎకరం వరి సాగుకు వినియోగించే నీటితో నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పండించవచ్చని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.