BREAKING
కలాం బాటలో నడవండి -కలలను సాకారం చేసుకుని గర్వకారణంగా ఎదగండి -బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు అర్హులందరికీ సంక్షేమ పథకాలు.. సిద్దిపేట తరహాలో వికారాబాద్ అభివృద్ధి చేస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రూ. 2 కోట్ల జీతం తగ్గించుకుని జట్టు మారిన టీమిండియా స్టార్ పేసర్, ఐపీఎల్ 2027లో మాజీ ఛాంపియన్ జట్టులోకి మొహమ్మద్ షమీ రైతులకు అండగా ప్రభుత్వం.. - ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం భూభారతి పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి ప్రజల భాగస్వామ్యంతో భూ రీ సర్వే పూర్తి చేయాలి ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం: జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు దివ్యాంగుడికి ఉచితంగా మూడు చక్రాల వాహనం అందజేసిన చైర్‌పర్సన్ గడ్డం అనన్య ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం: జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు యాసంగిలో వరి సాగు వద్దు! - ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి - జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గ్యాస్ పైప్‌లైన్ పనులు వేగవంతం చేయాలి మార్చి 2028 నాటికి పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు యువతలో ప్రతిభను వెలికితీయడమే యువజనోత్సవాల లక్ష్యం. అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు రెవిన్యూ విభాగంలోని పెండింగ్ఆర్జీలను వారంలోపు పరిష్కరించాలి: నగర కమిషనర్ ప్రేమతో జూనియర్ల హృదయాలను గెలుచుకోవాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తరలింపు

ప్రజల భాగస్వామ్యంతో భూ రీ సర్వే పూర్తి చేయాలి

Select Suryaa Now
ప్రజల భాగస్వామ్యంతో భూ రీ సర్వే పూర్తి చేయాలి

 

సూర్య - పెద్దపల్లి: గ్రామాల్లో చేపడుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కాల్వ శ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లోని మంగపేట, కిష్టంపేట, కేశనపల్లి గ్రామాల్లో రీ సర్వే పనులను పరిశీలించారు. అలాగే గంగారం, మొట్లపల్లి, పారుపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోళ్ల తీరును సమీక్షించారు. రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయించి నష్టపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలని, మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ పొందాలని సూచించారు. ధాన్యాన్ని ఆరబెట్టి నిర్దేశిత తేమశాతంతో కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ముత్తారంలో నూతన తహసిల్దార్ కార్యాలయంలో మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని, పాత కార్యాలయ భవనాన్ని గ్రంథాలయంగా వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పర్యటనలో సంబంధిత మండలాల తహసిల్దార్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.