BREAKING
ఐపీఎల్ 2027 మినీ వేలం, ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా విడుదల టిడిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి మూడోసారి పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వినోద్ కుమార్ గణాంకాల సేకరణలో సమన్వయం కీలకం -ఏఐఎస్‌హెచ్‌ఈ సర్వేలో చురుకైన భాగస్వాములు కావాలి : ఆచార్య విజయభాస్కరరావు గుమ్మగట్ట కేజీబీవీ విద్యార్థినులతో మాట్లాడుతున్న అనంతపురం జిల్లా డీఎంహెచ్ఓ కట్టా వెంకటేశ్వరరావు..!! ఎంఎస్ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటన, భావోద్వేగ పోస్ట్ చేసిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తిరుపతి విద్యార్థులకు అరుదైన గౌరవం -రాష్ట్రపతితో ముఖాముఖి...విద్యార్థులకు ప్రశంసల వెల్లువ టీయూడబ్ల్యూజే హెచ్-143 తాండూరు నియోజకవర్గ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక కళ్యాణదుర్గం సబ్ డివిజన్లో మూడవరోజు జోరుగా కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ. నూతన విద్యార్థులకు ఓరియంటేషన్ కలాం బాటలో నడవండి -కలలను సాకారం చేసుకుని గర్వకారణంగా ఎదగండి -బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు అర్హులందరికీ సంక్షేమ పథకాలు.. సిద్దిపేట తరహాలో వికారాబాద్ అభివృద్ధి చేస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రూ. 2 కోట్ల జీతం తగ్గించుకుని జట్టు మారిన టీమిండియా స్టార్ పేసర్, ఐపీఎల్ 2027లో మాజీ ఛాంపియన్ జట్టులోకి మొహమ్మద్ షమీ రైతులకు అండగా ప్రభుత్వం.. - ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం భూభారతి పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

కలాం బాటలో నడవండి -కలలను సాకారం చేసుకుని గర్వకారణంగా ఎదగండి -బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు

Select Suryaa Now
కలాం బాటలో నడవండి -కలలను సాకారం చేసుకుని గర్వకారణంగా ఎదగండి -బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ :అబ్దుల్ కలాం చెప్పిన జీవిత సత్యాలను గుర్తు చేస్తూ...కలాం బాటలో నడుస్తూ కలలను సహకారం చేసుకుని గర్వకారణంగా ఎదగాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఏవీఎస్ సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. సరోజినీ దేవి రోడ్డులోని ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గృహాన్ని సందర్శించి బాలికలతో నేరుగా ముచ్చటించారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలికలకు తమకు ఉన్న హక్కుల గురించి చైర్మన్ కూలంకషంగా వివరించారు. మీకు హక్కులు ఉన్నాయి... భయపడొద్దు అని ధైర్యం చెప్పారు. క్రమశిక్షణే మీ ఆయుధం, చదువే మీ భవిష్యత్తు అని గట్టిగా చెప్పారు. దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యతతో నడుచుకుని గర్వకారణంగా ఎదగాలని సూచించారు.

ఆపదలో ఉంటే 1098 కు కాల్ చేయండి

ఎవరైనా ఇబ్బంది పెడితే మౌనంగా భరించొద్దు, వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు కాల్ చేయండని భరోసా ఇచ్చారు. 14 ఏళ్ల లోపు ప్రతి చిన్నారి తప్పక చదువుకోవాలని స్పష్టం చేశారు. కంప్లైంట్ బాక్స్, సజెషన్ బాక్స్ ను ఎలా వాడాలో స్వయంగా చూపించారు. మీ బాధను కాగితంపై పెట్టండి...మీ గొంతు మేము వింటాం అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీపీఓ వి.శివశంకర్, పీఓ ఎన్ఐసీ దేవయాని, పీఓఐసీ కల్పన, పర్యవేక్షణాధికారి సి. నయోమి, వైద్యాధికారిణి ఎన్.జయశ్రీ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్