andhrapradesh
టిడిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి
- వగ్గంపల్లి అభివృద్ధికి మల్లేశ్వరికి పట్టం కట్టండి
- గ్రామ ప్రజలకు టిడిపి గ్రామ అధ్యక్షుడు బైరెడ్డి విజ్ఞప్తి
పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని వగ్గంపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బైరెడ్డి మల్లేశ్వరికి వగ్గంపల్లి పంచాయితీ ప్రజలు అండగా నిలిచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ టీడీపీ కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి వెంకటేశ్వరరెడ్డి (తుఫాన్‌రెడ్డి) కోరారు. సర్పంచ్‌గా మల్లేశ్వరికి అవకాశం కల్పిస్తే గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్య పరిష్కారం, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని ప్రజల సహకారంతో వగ్గంపల్లిని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమన్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ అందరికీ అందుబాటులో ఉండే నాయకత్వాన్ని అందిస్తామని పేర్కొన్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో మల్లేశ్వరి టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు కలిసికట్టుగా మద్దతు తెలిపి ఆమె విజయానికి కృషి చేయాలని వెంకటేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు.