అన్వేషణ సౌత్ జోన్ విజేతలకు అభినందన
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇటీవల నిర్వహించిన సౌత్ జోన్ విద్యార్థి పరిశోధన సదస్సు (దక్షిణ మండలం) అన్వేషణ- 2026లో ఎస్వీయూ విద్యార్థులు ప్రతిభ చూపి విజేతలుగా నిలిచారు. ఎస్వీయూ కల్చరల్ అఫైర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్ ఆధ్వర్యంలో ఈ ఘనత సాధించిన విద్యార్థుల బృందాన్ని వీసీ టాటా నర్సింగరావు, రెక్టార్ చెండ్రాయుడు అభినందించారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ విద్యార్థులు మరింత బాధ్యతతో, క్రమశిక్షణతో, సమాజ శ్రేయస్సు కోరే నూతన అంశాలను ఆవిష్కరించాలని కోరారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్