BREAKING
ఓటీటీలో విజయ్ ఆంటోని కొత్త క్రైమ్ థ్రిల్లర్, సంచలన మర్డర్ మిస్టరీతో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మార్గాన్ టాయిలెట్ల సమస్యను పరిష్కరించరా...! -అధికారుల తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం -విద్యార్థులు నరకం అనుభవిస్తున్నా అధికారులకు పట్టదా... కంబదూరులో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి. ఎస్సై గోపి. సల్మాన్ ఖాన్ మరో పెద్ద మనసు, మాతృభూమి సినిమా నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ఖరీదైన గడియారాలు బహుమతిగా ఇచ్చిన స్టార్ హీరో బ్యాడ్మింటన్ లో ఎస్వీయూ విద్యార్థి ప్రతిభ నేటి నుండి రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ -- జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ అంశాలలో  విద్యార్థులకు  పోటీలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు -- డిఇఓ వెంకట లక్ష్మమ్మ వెల్లడి జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎస్వీజేసీ విద్యార్ధి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డార్క్ వెబ్ సిరీస్ రివ్యూ, థ్రిల్లర్‌గా మారిన ప్రసిద్ధ కాలేజ్ ఫ్రాంచైజీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ పై అవగాహన తెలుగు సినిమాలకు శ్రీలీల దూరం కావడానికి అసలు కారణం అదే, ముంబైలో మెడికల్ ఇంటర్న్‌షిప్ వల్లే సినిమాలకు విరామం కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా.. బ్యాడ్మింటన్ లో చిన్నారుల షటిల్ యుద్ధం -ఫైనల్స్ లో హోరాహోరీ పోరులో విశాఖ హవా

కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా..

Select Suryaa Now
కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా..

హైదరాబాద్: రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు 'ఇందిరమ్మ బీమా' పథకం వర్తించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలో వేర్వేరుగా అమలవుతున్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణ, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. దీనివల్ల ఉపాధి హామీ కూలీలతో పాటు లక్షలాది మంది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. ఇప్పటికే అమలవుతున్న పథకాల్లో జీవిత బీమా కింద రూ.2 లక్షలు, ప్రమాద బీమా కింద రూ.10 లక్షల వరకు అందిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, వివిధ శాఖల్లో ఉన్న రూ.2 లక్షల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తెచ్చి రూ.5 లక్షలకు పెంచాలని, ప్రస్తుతం లభిస్తున్న ప్రమాద బీమా ప్రయోజనాలను యథాతథంగా కొనసాగించాలని సూచించారు. ఇప్పటివరకు ప్రభుత్వ బీమా భద్రత పొందుతున్న వారిలో ఏ ఒక్కరినీ మినహాయించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.

మరోవైపు, సిద్దిపేట సభలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ చీరల పంపిణీని రాష్ట్రంలోని అర్హులైన ప్రతి మహిళకు అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. పంపిణీకి వీలుగా చీరలను తక్షణమే అన్ని జిల్లాలకు తరలించాలని, ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందిరమ్మ బీమా దరఖాస్తులను గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచి విస్తృత ప్రచారం కల్పించాలని, ఈ రెండు కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు.