BREAKING
ఐపీఎల్ 2027 మినీ వేలం, ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా విడుదల టిడిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి మూడోసారి పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వినోద్ కుమార్ గణాంకాల సేకరణలో సమన్వయం కీలకం -ఏఐఎస్‌హెచ్‌ఈ సర్వేలో చురుకైన భాగస్వాములు కావాలి : ఆచార్య విజయభాస్కరరావు గుమ్మగట్ట కేజీబీవీ విద్యార్థినులతో మాట్లాడుతున్న అనంతపురం జిల్లా డీఎంహెచ్ఓ కట్టా వెంకటేశ్వరరావు..!! ఎంఎస్ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటన, భావోద్వేగ పోస్ట్ చేసిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తిరుపతి విద్యార్థులకు అరుదైన గౌరవం -రాష్ట్రపతితో ముఖాముఖి...విద్యార్థులకు ప్రశంసల వెల్లువ టీయూడబ్ల్యూజే హెచ్-143 తాండూరు నియోజకవర్గ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక కళ్యాణదుర్గం సబ్ డివిజన్లో మూడవరోజు జోరుగా కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ. నూతన విద్యార్థులకు ఓరియంటేషన్ కలాం బాటలో నడవండి -కలలను సాకారం చేసుకుని గర్వకారణంగా ఎదగండి -బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు అర్హులందరికీ సంక్షేమ పథకాలు.. సిద్దిపేట తరహాలో వికారాబాద్ అభివృద్ధి చేస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రూ. 2 కోట్ల జీతం తగ్గించుకుని జట్టు మారిన టీమిండియా స్టార్ పేసర్, ఐపీఎల్ 2027లో మాజీ ఛాంపియన్ జట్టులోకి మొహమ్మద్ షమీ రైతులకు అండగా ప్రభుత్వం.. - ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం భూభారతి పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

రైతులకు అండగా ప్రభుత్వం.. - ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Select Suryaa Now
రైతులకు అండగా ప్రభుత్వం.. -  ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

 

సూర్య - పెద్దపల్లి రూరల్  : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. పెద్దపల్లి మండలంలోని ముత్తారం గౌరెడ్డిపేట, రాఘవాపూర్, సబ్బితం, రంగాపూర్, దేవునిపల్లి, అందుగులపల్లి, బ్రాహ్మణపల్లి, రాగినేడు, అప్పన్నపేట గ్రామాల్లో సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, ధాన్యం తూకం, నాణ్యత పరిశీలన, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని అన్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో సింగిల్ విండో చైర్మన్ లు చింతపండు సంపత్, నరేష్ ముత్యాల, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.