BREAKING
సర్పంచ్ అభ్యర్థులుగా 153 మంది నామినేషన్లు అన్వేషణ సౌత్ జోన్ విజేతలకు అభినందన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా.. 19 నుంచి అమలు: చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ సంచలన నిర్ణయం, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చిత్రంలో పవర్‌ఫుల్ విలన్‌గా నటన రేపటి నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ -షెడ్యూల్ విడుదల చేసిన ఓఏమ్ డిసీ గణనీయంగా తగ్గిన రబీ సాగు విస్తీర్ణం కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించండి పూజ్యబాపూజీ కన్నకలలు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం --కలిసికట్టుగా పనిచేసి గ్రామపంచాయతీలు నూరుశాతం ఫలితాలు సాధించాలి --రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఐసీసీ భారీ జరిమానా, స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లకు షాక్ రైతులకు సకాలంలో పారదర్శకంగా ఎరువులు అందిస్తాం ఏపీపీ కే సునీల్ కుమార్ బలమైన వాదనలు ఎన్డీఏ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా షంషూర్ నామినేషన్ అప్పు చెల్లించలేదని ఇంటికి నిప్పు.. ఇల్లంతా దగ్ధం. షంషూర్ నామినేషన్‌కు పోటెత్తిన కూటమి శ్రేణులు ఐపీఎల్ 2027 మినీ వేలం, ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా విడుదల

గుమ్మగట్ట కేజీబీవీ విద్యార్థినులతో మాట్లాడుతున్న అనంతపురం జిల్లా డీఎంహెచ్ఓ కట్టా వెంకటేశ్వరరావు..!!

Select Suryaa Now
గుమ్మగట్ట కేజీబీవీ విద్యార్థినులతో మాట్లాడుతున్న అనంతపురం జిల్లా డీఎంహెచ్ఓ కట్టా వెంకటేశ్వరరావు..!!

గుమ్మగట్ట మేజర్ న్యూస్:

అస్వస్థతకు గురైన విద్యార్థినులకు చికిత్స అందించాం: డీఎంహెచ్ఓ!!గుమ్మగట్ట కేజీబీవీ పాఠశాలలో మంగళవారం 40 మంది విద్యార్థినులు కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలియగానే తక్షణమే వైద్య బృందం పాఠశాలకు చేరుకొని చికిత్స అందించినట్లు అనంతపురం జిల్లా డీఎంహెచ్ఓ కట్టా వెంకటేశ్వరరావు తెలిపారు,ఉదయం విషయం తెలుసుకున్న వెంటనే డాక్టర్ రమేష్, సందేశ్ తన బృందంతో హుటాహుటిన బయలుదేరి పాఠశాలకు చేరుకుని ప్రథమ చికిత్స అందించారు,వీరిలో 10 మందిని గుమ్మగట్ట పీహెచ్సీకి తరలించి ఐవీ ఫ్లూయిడ్స్ అందించారు. మిగిలిన వారికి పాఠశాలలోనే చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు,అనంతరం డీఎంహెచ్ఓ కట్టా వెంకటేశ్వరరావు స్వయంగా గుమ్మగట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అలాగే పాఠశాలకు చేరుకొని, చికిత్స పొందుతున్న విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలికల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

సూర్య ప్రతినిధి : పెన్నయ్య గుమ్మగట్ట మండలం రిపోర్టర్