BREAKING
తెలుగు సినిమాలకు శ్రీలీల దూరం కావడానికి అసలు కారణం అదే, ముంబైలో మెడికల్ ఇంటర్న్‌షిప్ వల్లే సినిమాలకు విరామం కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా.. బ్యాడ్మింటన్ లో చిన్నారుల షటిల్ యుద్ధం -ఫైనల్స్ లో హోరాహోరీ పోరులో విశాఖ హవా కలిసికట్టుగా సాగుతారా కత్తులు దూస్తారా! కూటమి ఐక్యతపైనే అందరి దృష్టి! వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ పై అందరి ధీమా.. గుమ్మగట్ట కేజీబీవీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 40 మంది బాలికలకు అస్వస్థత. ఘటన స్థలానికి ఆర్డిఓ వసంత బాబు. ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు సర్పంచ్ అభ్యర్థులుగా 153 మంది నామినేషన్లు అన్వేషణ సౌత్ జోన్ విజేతలకు అభినందన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా.. 19 నుంచి అమలు: చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ సంచలన నిర్ణయం, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చిత్రంలో పవర్‌ఫుల్ విలన్‌గా నటన రేపటి నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ -షెడ్యూల్ విడుదల చేసిన ఓఏమ్ డిసీ గణనీయంగా తగ్గిన రబీ సాగు విస్తీర్ణం కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించండి పూజ్యబాపూజీ కన్నకలలు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం --కలిసికట్టుగా పనిచేసి గ్రామపంచాయతీలు నూరుశాతం ఫలితాలు సాధించాలి --రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఐసీసీ భారీ జరిమానా, స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లకు షాక్

షంషూర్ నామినేషన్‌కు పోటెత్తిన కూటమి శ్రేణులు

Select Suryaa Now
షంషూర్ నామినేషన్‌కు పోటెత్తిన కూటమి శ్రేణులు

- పసుపుమయమైన పామూరు

- అంకాలమ్మ తల్లి సన్నిధిలో ప్రత్యేక పూజలతో నామినేషన్‌కు శ్రీకారం

- కనీవినీ ఎరుగని రీతిలో ర్యాలీ

- కదలివచ్చిన మూడు పార్టీల శ్రేణులు

పామూరు, మేజర్ న్యూస్ : 

పామూరు పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి షేక్. షంషూర్ భారీ ర్యాలీతో తన నామినేషన్ దాఖలు చేశారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో బలపరిచిన షంషూర్‌కు మద్దతుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంగళవారం ముందుగా తన నివాసంలో స్వామివారి ఆశీస్సులు పొందిన షంఘార్ అనంతరం కార్యకర్తలతో కలిసి అంకాలమ్మ వీధిలోని అంకాలమ్మ తల్లి దేవస్థానానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రచార రథంతో అంకాలమ్మ వీధి మీదుగా పట్టణంలోని ప్రధాన కూడలి వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు. మూడు పార్టీల జెండాలు, కార్యకర్తల నినాదాలు, అభిమానుల ఉత్సాహంతో పట్టణ ప్రధాన వీధులు మార్మోగాయి. ర్యాలీ సాగిన మార్గమంతా పసుపుమయంగా మారగా పట్టణంలో ఎక్కడ చూసినా కూటమి శ్రేణుల సందడే కనిపించింది. ర్యాలీని వీక్షించిన పట్టణ ప్రజలు సైతం షంషూర్‌కు లభించిన జన మద్దతును ఆసక్తిగా గమనించారు. నామినేషన్ సందర్భంగా కనిపించిన జనసమీకరణ, కూటమి పార్టీల ఐక్యతను చూసి షంషూర్ గెలుపు ఖాయమనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. అనంతరం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న షంషూర్ ఎన్నికల అధికారి రామారావుకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు యాదాల వెంకట సాయి కిరణ్, కొప్పల్లి సురేష్, శ్రీనివాసులు, బైరెడ్డి జయరామిరెడ్డి, మాచర్ల రహిమాన్, ఆర్ ఆర్ రఫీ, ఉప్పలపాటి హరిబాబు, చిరంజీవి, వాయినేని రాఘవ, ఆకుపాటి వెంకటేష్, పులి నాయబా తదితరులు పాల్గొన్నారు.