BREAKING
ఓటీటీలో విజయ్ ఆంటోని కొత్త క్రైమ్ థ్రిల్లర్, సంచలన మర్డర్ మిస్టరీతో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మార్గాన్ టాయిలెట్ల సమస్యను పరిష్కరించరా...! -అధికారుల తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం -విద్యార్థులు నరకం అనుభవిస్తున్నా అధికారులకు పట్టదా... కంబదూరులో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి. ఎస్సై గోపి. సల్మాన్ ఖాన్ మరో పెద్ద మనసు, మాతృభూమి సినిమా నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ఖరీదైన గడియారాలు బహుమతిగా ఇచ్చిన స్టార్ హీరో బ్యాడ్మింటన్ లో ఎస్వీయూ విద్యార్థి ప్రతిభ నేటి నుండి రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ -- జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ అంశాలలో  విద్యార్థులకు  పోటీలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు -- డిఇఓ వెంకట లక్ష్మమ్మ వెల్లడి జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎస్వీజేసీ విద్యార్ధి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డార్క్ వెబ్ సిరీస్ రివ్యూ, థ్రిల్లర్‌గా మారిన ప్రసిద్ధ కాలేజ్ ఫ్రాంచైజీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ పై అవగాహన తెలుగు సినిమాలకు శ్రీలీల దూరం కావడానికి అసలు కారణం అదే, ముంబైలో మెడికల్ ఇంటర్న్‌షిప్ వల్లే సినిమాలకు విరామం కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా.. బ్యాడ్మింటన్ లో చిన్నారుల షటిల్ యుద్ధం -ఫైనల్స్ లో హోరాహోరీ పోరులో విశాఖ హవా

కలిసికట్టుగా సాగుతారా కత్తులు దూస్తారా! కూటమి ఐక్యతపైనే అందరి దృష్టి! వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ పై అందరి ధీమా..

Select Suryaa Now
కలిసికట్టుగా సాగుతారా కత్తులు దూస్తారా!   కూటమి ఐక్యతపైనే అందరి దృష్టి!  వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ పై అందరి ధీమా..

బుట్టాయిగూడెం: మేజర్ న్యూస్:  స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో  రాజకీయా  పరిణామాలు ఆసక్తికరoగా మారాయి.  ఇప్పటివరకు కలిసికట్టుగా ఉన్న కూటమి నాయకుల ఐక్యత  బయటపడే రోజులు రానే వచ్చాయి. ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే  రాజుకుంటుంది.  మిత్రధర్మం పాటిస్తూ ఐక్యంగా ముందుకు సాగుతారా లేక అంతర్గత విభేదాలతో కుమ్ములాడుకుంటారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

 నాయకుల మధ్య సమన్వయం ఎంతవరకు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ఒకే తాటిపైకి వస్తారా లేక ఆధిపత్య పోరుకు తెరలేపుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

కూటమిలోని నాయకులు పరస్పర సహకారంతో అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారో లేక  కూటమిలోని నాయకులు  లోలోన  ఒకరిపై ఒకరు ఎత్తుగడలు వేసుకుని  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తారా అన్నది ఇప్పుడు గ్రామాల్లో చర్చ మొదలైంది. కూటమిలోని   టిక్కెట్ ఆశించి భంగపడిన వారు రాజకీయ ప్రయోజనాల కోసం  రెబల్స్ గా మారి  ఒకరిపై ఒకరు పోటీకి దిగుతారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఒకవేళ కూటమి నాయకుల మధ్య విభేదాలు తలెత్తి రెబల్ అభ్యర్థులు బరిలో నిలిస్తే, ఓట్లు చీలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిణామాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు కూడా ప్రజల నుండి  వ్యక్తమవుతున్నాయి.

కూటమి నాయకులు అసంతృప్తులను బుజ్జగించి మిత్రధర్మాన్ని కాపాడుకోకపోతే  ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు  మళ్లీ చవి చూడవలసి వస్తుందని  రాజకీయ విశ్లేషకులు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్ ఆశించి భంగపడిన వారిని బుజ్జగించినప్పటికీ  మరికొందరు  కూటమి అభ్యర్థులకు ఓటు వేయకుండా  ప్రత్యార్థులకు మేలు చేసే అవకాశం ఎంతైనా ఉంది.   టికెట్ ఆశించి భంగపడిన నేతలు పైకి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు కనిపించినా లోలోపల రగులుతున్న అసంతృప్తిని  ఓటు రూపంలో  ప్రత్యార్థులకు మేలు చేస్తారనేది  అందరికీ తెలిసిందే.  ఎంపీటీసీ ఎన్నికల్లో  జనసేన తెలుగుదేశం పార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకున్నప్పటికీ బిజెపికి మొండిచేయి చూపించారు. మరి ఈ సర్పంచ్ ఎన్నికల్లో  బిజెపికి సీటు సర్దుబాట్లు చేస్తారా  లేక మళ్ళీ మొండి చెయి చూపిస్తారా అంటూ మండలంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం మండల రాజకీయాల్లో రానున్న రోజులు కీలకంగా మారనున్నాయి.