BREAKING
సొసైటీ ఎన్నికలకు పటిష్ట చర్యలు రంగురంగుల డ్రెస్‌లో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ విందు, లేటెస్ట్ ఫోటోలు వైరల్ వివిధ అంశాలలో  విద్యార్థులకు  పోటీలు తూర్పు నాయుడుపాలెం గ్రామ సర్పంచిగా ఏకగ్రీవమైన దామచర్ల విజయలక్ష్మి. మెగాస్టార్ చిరు లీక్స్, కాకా చిత్రంలో అనస్వర రాజన్ పాత్ర రహస్యం బట్టబయలు తాటిపాకలో గ్యాస్ కలకలం హౌస్ పల్లిలో ఘనంగా సదర్ సమ్మేళన వేడుకలు మలయాళ యువ హీరో నస్లెన్‌కు సూర్య ఊహించని కానుక, సినిమా విజయంతో లక్షల విలువైన కార్టియర్ వాచ్ బహుమతి ఈ విజయం ప్రజలకే అంకితం : రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు ఓటీటీలో విజయ్ ఆంటోని కొత్త క్రైమ్ థ్రిల్లర్, సంచలన మర్డర్ మిస్టరీతో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మార్గాన్ టాయిలెట్ల సమస్యను పరిష్కరించరా...! -అధికారుల తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం -విద్యార్థులు నరకం అనుభవిస్తున్నా అధికారులకు పట్టదా... కంబదూరులో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి. ఎస్సై గోపి. సల్మాన్ ఖాన్ మరో పెద్ద మనసు, మాతృభూమి సినిమా నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ఖరీదైన గడియారాలు బహుమతిగా ఇచ్చిన స్టార్ హీరో బ్యాడ్మింటన్ లో ఎస్వీయూ విద్యార్థి ప్రతిభ

టాయిలెట్ల సమస్యను పరిష్కరించరా...! -అధికారుల తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం -విద్యార్థులు నరకం అనుభవిస్తున్నా అధికారులకు పట్టదా...

Select Suryaa Now
టాయిలెట్ల సమస్యను పరిష్కరించరా...! -అధికారుల తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం -విద్యార్థులు నరకం అనుభవిస్తున్నా అధికారులకు పట్టదా...

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ వామనరావు భవనంలో గత ఐదేళ్లుగా టాయిలెట్ల సమస్య విద్యార్థులను, అధ్యాపకులను వేధిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ఏఐఎస్ఎఫ్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు వర్సిటీ వామనరావు భవనం ఎదుట మంగళవారం పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించి వీసీ, రెక్టార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమతి సభ్యులు చిన్న మాట్లాడుతూ వర్సిటీలోని వామనరావు భవనంలో దాదాపు 8 విభాగాలలో 200మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఇందులో విద్యార్థులకు కనీసం తాగునీరు, టాయిలెట్లు లేకపోవడం దారుణమని, పలు మార్లు వర్సిటీ అధికారులకు విన్నవించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తూ విద్యార్థులకు నరకం చూపిస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. మహిళలు టాయిలెట్ కి వెళ్లడానికి పక్కనున్న డిపార్ట్మెంట్ కు వేళ్లాల్సి వస్తోందని, అక్కడ పనిచేసి ఉద్యోగులు ఆ టాయిలెట్స్ కు తాళాలు వేసి విద్యార్థులను వెనక్కి పంపడం జరుగుతోందని, ఇది వర్సిటీ ప్రతిష్టకు తీరని మచ్చ అని వాపోయారు. దేశంలోనే పేరొందిన వర్సిటీగా గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఇక్కడ పరిస్థితి దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న వీసీ, రెక్టార్, ప్రిన్సిపల్ హుటాహుటిన అక్కడకు చేరుకుని రెండు వారాలలో వాష్రూమ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ఎఐ వర్సిటీ అధ్యక్షులు రవి, జై భారత్ నేషనల్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు భార్గవ్ సాయి, జీఎన్ఎస్ నేత శివశంకర్, విద్యార్థి సంఘాల నేతలు వెంకటేష్, చరణ్, వేణు, ప్రేమ్, గౌతమ్, అంజలి పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్