ఈ విజయం ప్రజలకే అంకితం : రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ
గుంటూరు : గుoటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరపున అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచిన ప్రజా ప్రతినిధులకు అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రజానీకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఈ విజయం ప్రజలకే అంకితమని రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ అన్నారు. మంగళవారం గోరంట్ల భాష్యం గ్రౌండ్స్ లో ఎంపీ రామకృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు కుటుంబ సమేతంగా ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఈ విజయం కూటమి ప్రభుత్వంపై ప్రజా విశ్వాసాన్ని మరోసారి రుజువు చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మరింత బలపడి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించి తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా కృషి చేయాలని కోరారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు మాట్లాడుతూ అందరిని ఒకే తాటి పైకి తీసుకువచ్చి ఈ విధంగా సన్మానించడం ఎంతో గొప్ప విషయమని, ఇది ఎంపీ రామకృష్ణ మంచి మనసుకు నిదర్శనం అన్నారు. ఇదే విజయోత్సాహంతో కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ గుంటూరు అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మరింత కృషి చేస్తామని ముక్తకంఠం తో నినదించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన 65 మంది కార్పొరేటర్ లను ఎంపీ భాష్యం రామకృష్ణ దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులకు భారీ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్, ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు రామాంజనేయులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు మేయర్ కోవెలమూడి లక్ష్మి అపర్ణ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, రాష్ట్ర జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, జిల్లా బిజెపి అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.
కే నాగరాజు గుంటూరు క్రైమ్