BREAKING
హౌస్ పల్లిలో ఘనంగా సదర్ సమ్మేళన వేడుకలు బీఏఎస్‌ఎఫ్–ఎవోనిక్ మెగా టేకోవర్ డీల్‌.. మరింత ఆకర్షణీయమైన కొత్త ఆఫర్‌కు సిద్ధమవుతున్న BASF! ఓఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... డీఐపీఆర్‌వో చెన్నకేశవరావుకు సహచర ఉద్యోగుల ఘన సత్కారం.. ఆదరించండి అండగా ఉంటాను... చైనా–చిలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం.. ఏఐ , సముద్ర పరిశోధన రంగాల్లో సహకారం పెంపు! రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట పోలీసు భద్రత.. షాహీనా కుటుంబానికి అండగా హరీష్ రావు -ఎమ్మెల్యే సహకారంతో ఆర్థిక సాయం అందజేత రోజూ ఉడికించిన గుడ్డు తింటే నిజంగా కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్య నిపుణులు ఇస్తున్న అసలు సమాచారం ఇదే అమెరికా మార్కెట్లలో టెక్నాలజీ షేర్ల భారీ పతనం.. సేల్స్‌ఫోర్స్‌, సర్వీస్‌నౌ స్టాక్స్‌కు గట్టి దెబ్బ! అమెరికా మార్కెట్లలో టెక్నాలజీ షేర్ల భారీ పతనం.. సేల్స్‌ఫోర్స్‌, సర్వీస్‌నౌ స్టాక్స్‌కు గట్టి దెబ్బ! సైబర్ నేరం కేసులో విద్యుత్ శాఖ ఒప్పంద ఉద్యోగి అరెస్ట్.. 11 నెలలుగా వేతనాలేవీ..? స్వచ్ఛ కార్మికుల ఆగ్రహం! కారంమెతుకులతో డీఈఓ ఎదుట నిరసన.. కలెక్టరేట్ ముట్టడి నామినేషన్ కేంద్రాలు పరిశీలించిన ఆర్డీఓ ,డియస్పి కోటబొమ్మాళి రాజకీయాల్లో ‘బోయిన సోదరుల’ ప్రస్థానం

సొసైటీ ఎన్నికలకు పటిష్ట చర్యలు

Select Suryaa Now
సొసైటీ ఎన్నికలకు పటిష్ట చర్యలు

 నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం 

తూర్పు గోదావరి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ముందస్తు ఏర్పాట్లతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు.

మంగళవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో సహకార సంఘాల ఎన్నికల సన్నాహాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి దశలో ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం–1964, రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ జారీ చేసిన మార్గదర్శకాలు, నిర్దేశిత ఎన్నికల విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సభ్యుల వివరాల పరిశీలన, ఓటు హక్కు అర్హత నిర్ధారణ, ఈ-కేవైసీ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని  ఆదేశించారు. ప్రతి పిఏ సి ఎస్ పరిధిలోని సభ్యులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయించాలని, అసంపూర్తిగా ఉన్న వివరాలను వెంటనే సరిచేసి అర్హులైన సభ్యుల ఓటరు జాబితాలను నిబంధనల ప్రకారం సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రక్రియను సంబంధిత సొసైటీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు  నిరంతరం పర్యవేక్షించాలని, ఈ-కేవైసీ పురోగతిపై ప్రతిరోజూ నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో నియమితులయ్యే అధికారులు, సిబ్బందికి ముందుగానే బాధ్యతలను స్పష్టంగా తెలియజేయడంతో పాటు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సామగ్రి సమీకరణ, రవాణా, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బందిని వివిధ శాఖల నుంచి కేటాయించడం, పాఠశాలలు, కళాశాలల భవనాలను పోలింగ్, పంపిణీ కేంద్రాలుగా వినియోగించేందుకు అనుమతులు పొందడం, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని భద్రపరచడం, అవసరమైన ఆర్టీసీ బస్సులు సమకూర్చడం వంటి అంశాలపై సంబంధిత శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సున్నిత, అతి సున్నిత ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును పటిష్టం చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి అంశాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.అంతకు ముందు జిల్లా సహకార అధికారి ఎం. వెంకట రమణ ఎన్నికల సన్నాహాలకు సంబంధించిన గణాంకాలు, ఏర్పాట్ల వివరాలను సమావేశంలో వివరించారు. జిల్లా పరిధిలో ఎనిమిది నియోజక వర్గాల పరిధిలో మొత్తం 128 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా, వాటిలో 1,37,884 మంది సభ్యులు ఉన్నారని, కనీసం రూ.300 షేర్ క్యాపిటల్ కలిగిన 1,22,492 మంది సభ్యులు (88.8 శాతం) ఓటు హక్కుకు అర్హులుగా ఉన్నారని తెలిపారు. సీతానగరం మండలంలో అత్యధికంగా 13,098 మంది, ఉండ్రాజవరం మండలంలో 12,089 మంది, దేవరపల్లిలో 9,820 మంది, నిడదవోలులో 8,965 మంది సభ్యులు ఉన్నట్లు వివరించారు. ప్రతి సహకార సంఘంలో 13 ప్రాదేశిక నియోజకవర్గాల చొప్పున జిల్లావ్యాప్తంగా మొత్తం 1,664 ప్రాదేశిక నియోజకవర్గాలు, పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. రిజర్వేషన్ విధానంలో ఒక్కో సంఘానికి 7 ఓపెన్ కేటగిరీ, 2 బీసీ, 2 ఎస్సీ మహిళలు, 1 ఎస్టీ, 1 ఓపెన్ కేటగిరీ మహిళ స్థానం చొప్పున కేటాయింపులు ఉంటాయని అయన వివరించారు.పోలింగ్ నిర్వహణ కోసం రాజమహేంద్రవరం డివిజన్‌లో 70, కొవ్వూరు డివిజన్‌లో 58 చొప్పున మొత్తం 128 పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలను పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 1,664 మంది ప్రిసైడింగ్ అధికారులు (PO), 3,328 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు (APO/OPO) కలిపి మొత్తం 4,992 మంది సిబ్బంది అవసరమవుతారని, ప్రతి PACSకు ఒకరు చొప్పున 128 మంది ఎన్నికల అధికారులను నియమించాల్సి ఉంటుందని వివరించారు. అదేవిధంగా 1,830 బ్యాలెట్ బాక్సులు, 1,51,671 బ్యాలెట్ పత్రాలు, 6,656 స్టాంపులు, 1,850 సిరా సీసాలు తదితర ఎన్నికల సామగ్రి సమీకరణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామగ్రి తరలింపునకు ఆర్టీసీ బస్సులు, మినీ బస్సుల ఏర్పాట్లతో పాటు పంపిణీ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లాలో 20 సెన్సిటివ్, 7 హైపర్ సెన్సిటివ్ సహకార సంఘాలను గుర్తించినట్లు సహకార అధికారి వివరించారు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, రాజానగరం, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పరిస్థితులను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సి ఉందని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి ఎం. వెంకట రమణ, రాజమహేంద్రవరం డివిజనల్ సహకార అధికారి ఎం. జగన్నాథరెడ్డి, కొవ్వూరు డివిజనల్ సహకార అధికారి కె. యమున, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.