హౌస్ పల్లిలో ఘనంగా సదర్ సమ్మేళన వేడుకలు
ధాగూర్:ధాగూర్ మండల పరిధిలోని హౌస్ పల్లి గ్రామంలో సదర్ సమ్మేళన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. హౌస్ పల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు స్థానికుల నుండి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి పట్లోల్ల రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.గ్రామ సర్పంచ్ మహేష్ యాదవ్, యాదవ సంఘం ప్రతినిధులు,వివిధ గ్రామాల సర్పంచులు,గ్రామ పెద్దలు,స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సదర్ వేడుకలను విజయవంతం చేశారు.సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించిన ఈ సమ్మేళనం గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపింది.