ఎన్ ఎం ఎం ఎస్ పరీక్ష వాయిదా.
డిసెంబర్ 13న నిర్వహణ.
- డిఈఓ నాగేశ్వరరావు.
అనకాపల్లి, నవంబర్ 17, మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పథకం (ఎన్.ఎం.ఎం.ఎస్) పరీక్షను స్థానిక ఎన్నికల నిర్వహణ కారణంగా వాయిదా వేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి జి.ఎస్ నాగేశ్వరరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఇంతకుముందు ప్రకటించిన విధంగా 29-11-2026 తేదీన కాకుండా 13-12-2026 తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడును. కావున ఎన్.ఎం. ఎం.ఎస్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ మార్పును గమనించి 13-12-2026న పరీక్షకు హాజరు కావలసిందిగా తెలియజేయడమైనది. ఈ విషయాన్ని విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గమనించి విద్యార్థులకు తెలియజేయవలసిందిగా అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి జి. ఎస్. నాగేశ్వరరావు తెలియజేశారు.