BREAKING
మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు 1 వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మున్సిపల్ చైర్ పర్సన్ బెజవాడ లావణ్య నాగరాజు చినబోగిల సర్పంచ్‌గా మర్రాపు శంకరరావు ఏకగ్రీవ ఎన్నిక రామాయంపేటలో 142 మందికి చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ అక్రమ మద్యం రవాణా భగ్నం.. 46 విస్కీ సీసాలు స్వాధీనం కన్నతల్లిని కడతేర్చిన కొడుకు రోకలిబండతో తలపై బాది దారుణ హత్య. గిన్నిస్ రికార్డు కెక్కిన రెండు నెలల చిన్నారి. చేయూతతో ఆర్థిక భరోసా - ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పురుషులను మించి మహిళా ఓటర్లు! ఎస్.రాయవరంలో నేడు విద్యుత్ అంతరాయం! రేవుపోలవరం అయ్యప్ప పీఠానికి అయ్యప్ప విగ్రహం బహుకరణ! అమెరికా ప్రభుత్వ సేవల్లో టెక్నికల్ లోపాలకు సైబర్ దాడి కారణం కాదు: హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి వెల్లడి! ఇంట్లో ఈ 10 రకాల మొక్కలు ఉంటే స్వచ్ఛమైన గాలితో పాటు సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం వెల్డింగ్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి. రష్యాలో కఠిన చట్ట సవరణ: యుద్ధ వ్యతిరేక వ్యాఖ్యలపై భారీ జరిమానాల బిల్లుకు స్టేట్ డూమా తొలి ఆమోదం!

ఎన్‌సీసీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.. 100 యూనిట్ల రక్తం సేకరణ

Select Suryaa Now
ఎన్‌సీసీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.. 100 యూనిట్ల రక్తం సేకరణ

 

ఐతం ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా రక్తదాన కార్యక్రమం
టెక్కలి మేజర్ న్యూస్:17
ఎన్‌సీసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని 14 ఆంధ్ర ఎన్‌సీసీ బెటాలియన్, శ్రీకాకుళం ఆధ్వర్యంలో ఐతం ఇంజినీరింగ్ కళాశాలలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఐతం ఇంజినీరింగ్ కళాశాల, మహీంద్రా, ప్రణవి, నరసన్నపేట డిగ్రీ కళాశాలలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 100 యూనిట్ల రక్తాన్ని సేకరించి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి, టెక్కలి జిల్లా ఆసుపత్రికి అందజేశారు. దేశ రక్షణలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తాము ముందుంటామని ఎన్‌సీసీ క్యాడెట్లు చాటిచెప్పారు.
14 ఆంధ్ర ఎన్‌సీసీ బెటాలియన్ రెండవ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రదీప్ కుమార్ మీనా, సుబేదార్ మేజర్ ఆర్డినరీ లెఫ్టినెంట్ బల్వంత్ సింగ్ పర్యవేక్షణలో ఈ శిబిరం నిర్వహించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి. నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.ఎస్. శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరగడం సంతోషకరమన్నారు. రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేసి వారి సేవాభావాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో వైద్యురాలు బి. సునీత, డాక్టర్ డి. విష్ణుమూర్తి, డీన్లు, విభాగాధిపతులు, ఎస్టేట్ మేనేజర్ పిరియా రమేష్ కుమార్, ఎన్‌సీసీ సిబ్బంది లెఫ్టినెంట్ టి. మురళీమోహన్, శిక్షకులు భుజంగరావు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన క్యాడెట్లు, విద్యార్థులను కళాశాల యాజమాన్యం, ఎన్‌సీసీ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.