BREAKING
మా ఆస్తుల జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవు 1 వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మున్సిపల్ చైర్ పర్సన్ బెజవాడ లావణ్య నాగరాజు చినబోగిల సర్పంచ్‌గా మర్రాపు శంకరరావు ఏకగ్రీవ ఎన్నిక రామాయంపేటలో 142 మందికి చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ అక్రమ మద్యం రవాణా భగ్నం.. 46 విస్కీ సీసాలు స్వాధీనం కన్నతల్లిని కడతేర్చిన కొడుకు రోకలిబండతో తలపై బాది దారుణ హత్య. గిన్నిస్ రికార్డు కెక్కిన రెండు నెలల చిన్నారి. చేయూతతో ఆర్థిక భరోసా - ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పురుషులను మించి మహిళా ఓటర్లు! ఎస్.రాయవరంలో నేడు విద్యుత్ అంతరాయం! రేవుపోలవరం అయ్యప్ప పీఠానికి అయ్యప్ప విగ్రహం బహుకరణ! అమెరికా ప్రభుత్వ సేవల్లో టెక్నికల్ లోపాలకు సైబర్ దాడి కారణం కాదు: హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి వెల్లడి! ఇంట్లో ఈ 10 రకాల మొక్కలు ఉంటే స్వచ్ఛమైన గాలితో పాటు సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం వెల్డింగ్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి. రష్యాలో కఠిన చట్ట సవరణ: యుద్ధ వ్యతిరేక వ్యాఖ్యలపై భారీ జరిమానాల బిల్లుకు స్టేట్ డూమా తొలి ఆమోదం!

24న పుల్లూరుబండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు

Select Suryaa Now
24న పుల్లూరుబండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు

సిద్దిపేట రూరల్, ;.  న్యూస్:కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పుల్లూరుబండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఈ నెల 24న సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించనున్నట్లు క్షేత్ర వంశపారంపర్య అర్చకులు తెలిపారు. ఉదయం జరిగే ఈ కార్యక్రమంలో తులసీ కల్యాణంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా అర్చకులు కలకుంట్ల వెంకట నర్సింహాచార్యులు, కృష్ణమాచార్యులు, రంగాచారి, చిలకమర్రి వెంకట రమణాచార్యులు, శేషుకుమార్, హరినాథ్, గౌతమ్‌లతో పాటు గ్రామ సర్పంచ్ కుంచం లత వెంకట్, మాజీ సర్పంచులు తిరుపతిరెడ్డి, నరేష్ గౌడ్, దేశిట్టి తిరుపతి, యాదగిరి, కనక మల్లేశం తదితరులు వ్రతాల కరపత్రాన్ని మంగళవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసంలో దైవారాధన, దీపారాధన, పూజలు నిర్వహించడం ఎంతో పుణ్యప్రదమని తెలిపారు. భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన, భక్తిభావాన్ని పెంపొందించేందుకు ప్రతి ఏటా పుల్లూరుబండ క్షేత్రంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. వ్రతంలో పాల్గొనే దంపతులు రూ.301 చెల్లించి రశీదు పొందాలని నిర్వాహకులు సూచించారు.