గ్రామీణ సహకార విశ్లేషణ సదస్సు నిర్వహించిన కే ఎల్ టి హెచ్ యూనివర్సిటీ
గజ్వేల్ ; . సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో మంగళవారం నాడు కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ సైన్సెస్ వారి సౌజన్యంలో భాగంగా విద్యార్థులు గ్రామీణ సహకార విశ్లేషణ సదస్సు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులు, రైతులతో కలిసి గ్రామంలోని రహదారులు, నివాస ప్రాంతాలు, వ్యవసాయ భూములు, నీటి వనరులు, పాఠశాలలు, ఇతర ముఖ్యమైన గ్రామ వనరులను గుర్తించి గ్రామ పటాన్ని పాఠశాల ఆవరణలో రూపొందించారు.అలాగే గ్రామంలోని రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలు, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని వాటిని గుర్తించడంపై చర్చించారు. గ్రామ ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో గ్రామ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని చెప్పొచ్చు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ రైతులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్, లక్ష్మణ్ పాల్గొని విద్యార్థులకు తమ సహకారాన్ని అందించారు.