BREAKING
రేవుపోలవరం అయ్యప్ప పీఠానికి అయ్యప్ప విగ్రహం బహుకరణ! అమెరికా ప్రభుత్వ సేవల్లో టెక్నికల్ లోపాలకు సైబర్ దాడి కారణం కాదు: హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి వెల్లడి! ఇంట్లో ఈ 10 రకాల మొక్కలు ఉంటే స్వచ్ఛమైన గాలితో పాటు సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం వెల్డింగ్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి. రష్యాలో కఠిన చట్ట సవరణ: యుద్ధ వ్యతిరేక వ్యాఖ్యలపై భారీ జరిమానాల బిల్లుకు స్టేట్ డూమా తొలి ఆమోదం! సీఎం సభను ప్రతాప్ రెడ్డి అడ్డుకుంటాం అనడం సిగ్గుచేటు ముప్పు గ్రామాల కౌన్సిలర్లు.. మంత్రి నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీటీసీ లాల్ స్వామి ఎస్.రాయవరంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ! ఆరోగ్య ప్రయోజనాల ఖజానా తాటి మొలకలు, రాజన్న సిరిసిల్ల మార్కెట్‌లో సందడి చేస్తున్న రుచికరమైన గేగులు ఎన్ ఎం ఎం ఎస్ పరీక్ష వాయిదా. ఎన్‌సీసీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.. 100 యూనిట్ల రక్తం సేకరణ గ్రామీణ సహకార విశ్లేషణ సదస్సు నిర్వహించిన కే ఎల్ టి హెచ్ యూనివర్సిటీ విధులు పక్కనపెట్టి పోలీసుల చిందులు.. 14 మందిపై చర్యలు! అక్వాన్ తుపానుపై రైతులు జాగ్రత్తగా పాటించాలి 24న పుల్లూరుబండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు

చంద్రబాబు పాలనకు ఆకర్షితులై టీడీపీలోకి 20 కుటుంబాలు

Select Suryaa Now
చంద్రబాబు పాలనకు ఆకర్షితులై టీడీపీలోకి 20 కుటుంబాలు

 

​కోటబొమ్మాళి, నవంబర్ 17, మేజర్ న్యూస్:

​సంతబొమ్మాళి మండలం బావనపాడు గ్రామ పంచాయతీకి చెందిన 20 వైకాపా కుటుంబాలు మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో వారు వైకాపాను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

​రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న నిరంతర కృషి, ప్రజలకు చేరువవుతున్న సంక్షేమ పథకాలపై ఉన్న విశ్వాసంతోనే తాము టీడీపీలో చేరినట్లు కొత్తగా చేరిన వారు తెలిపారు. అలాగే, టెక్కలి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి అచ్చెన్నాయుడు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ తమను ఎంతగానో ఆకర్షించిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరి వరప్రసాద్‌తో పాటు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎస్. ప్రకాష్, వల్లమ్మ, నీలమ్మ, కె. రాజు, బి. ధనరాజు, కృష్ణమూర్తి, ఈశ్వరమ్మ, అప్పలస్వామి తదితరులు ఉన్నారు.