డీఐపీఆర్‌వో చెన్నకేశవరావుకు సహచర ఉద్యోగుల ఘన సత్కారం..
శ్రీకాకుళం, నవంబర్ 17 మేజర్ న్యూస్:
విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు అధికారిక విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా రాష్ట్ర స్థాయి ‘ఉత్తమ అధికారి’ పురస్కారం అందుకున్న జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి (డీఐపీఆర్‌వో) చెన్నకేశవరావును సహచర ఉద్యోగులు మంగళవారం అషియల్ కాలనీలో తమ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.
సిఐఐ రాష్ట్ర స్థాయి సదస్సు ప్రత్యక్ష ప్రసారాల నిర్వహణ, డెలిగేట్స్ బైట్స్ రూప కల్పనలో చేసిన కృషికి గాను అవార్డు సాధించి, శ్రీకాకుళం జిల్లా సమాచార శాఖ కీర్తిని ఇనుమడింపజేశారని ఉద్యోగులు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ అభినందన కార్యక్రమంలో డివిజనల్ పీఆర్వో ఎన్. రాజు, ఏపీఆర్వో పైడి మురళీ, పీఆర్వో సత్య ప్రసాద్, సహాయ సమాచార ఇంజనీర్లు ఎం. అప్పలనాయుడు, కె. పుణ్యవతి, ఫోటోగ్రాఫర్ కే.రాజు, సీనియర్ అసిస్టెంట్ కృష్ణం రాజు, ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్లు కే.నారాయుడు, ఎం.ఉమా మహేశ్వరరావు, టైపిస్టులు నీహార్, రామోజీరావు, సిబ్బంది ప్రసాద్, నీలిమ, బి. శ్రీను, భూదేవి, శిమ్మమ్మ, రాంబాయి, లీల వేణి, తదితరులు పాల్గొన్నారు.