ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ శ్రీనివాసులు విచ్చేసి గ్రంథాలయ ఉద్యమకర్తల చిత్రపటాలకు పూలమాల వేసి వారి సేవలను కొనియాడారు. స్వాతంత్య్ర ఉద్యమానికి సమాంతర ఉద్యమంగా నడిచిన గ్రంథాలయ ఉద్యమం గురించి, గ్రంథాలయ సేవా నిరతులైన అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, గడిచర్ల హరి సర్వోత్తమ రావు, ఎస్ఆర్ రంగనాథన్ గ్రంథాలయ అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసించారు. అనంతరం పుస్తకపఠనం ఆశ్యకతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎం కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ లైబ్రేరియన్ డాక్టర్ కె నటరాజనాయుడు, లైబ్రేరియన్లు ఎస్ శివప్రసాద్ రాజు, నిరంజన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్