బ్యాడ్మింటన్ లో ఎస్వీయూ విద్యార్థి ప్రతిభ
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ అంతర్ కళాశాల బ్యాడ్మింటన్ పోటీలలో ఫిజిక్స్ విభాగానికి చెందిన విద్యార్థి పి ధనుష్ కుమార్ అత్యుత్తమ ప్రతిభ కనబరచి విజేతగా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా విభాగాధిపతి ప్రొఫెసర్ బి దేవప్రసాదరాజు విద్యార్థిని అభినందించారు. విద్యార్థులు అకడమిక్ విద్యతో పాటు క్రీడల్లో సైతం ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికవడం వర్సిటీకి గర్వకారమని కొనియాడారు. వీసీ టాటా నర్సింగరావు, రెక్టార్ చెండ్రాయుడు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, అధ్యాపకులు ప్రతిభ చూపిన విద్యార్థి ధనుష్ ను అభినందించారు
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్