మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
ఏలూరు, నవంబర్, 17 : ఏలూరు నగర కార్పొరేషన్లో రెవిన్యూ విబాగం నందు ప్రజల నుండి వసూలు చేసిన పన్నులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మంగళవారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ జి.వి. కృష్ణారావు అధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. నగరపాలక సంస్థ కమీషనర్ తో సమావేశమై రికార్డులు దస్త్రాలు పరిశీలించారు. కమీషనర్ ని కలిసి రెవిన్యూ విభాగంలో సిబ్బందిని విచారణ చేసి సంబంధిత దస్త్రాలు తనిఖీ చేశారు. సదరు విచారణలో భాగంగా కోటి 30 లక్షలు రూపాయలు దుర్వినియోగం అయినట్లు ప్రాధమికంగా నిర్దారించారు. మొత్తం ప్రభుత్వ నిధులు ఎంత దుర్వినియోగం అయింది, దానికి ఎవరెవరు బాధ్యులు అనే కోణంలో కేసుపై సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తామని ఏసిబి డిఎస్పీ కృష్ణారావు చెప్పారు.
ఏసిబి ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, బాలకృష్ణ మరియు ఏసీబీ సిబ్బంది తనిఖీలో పాల్గొన్నారు.