ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ పై అవగాహన
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ సాయికుమారి అధ్యక్షతన ఫైనాన్సియల్ ఇన్ క్లూజన్ (ఆర్ధిక సమ్మిళితత్వం) అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్బీఐ మేనేజర్ రామకృష్ణ హాజరై మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరికీ తక్కువ ఖర్చుతో సులభంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు అందించడమే ఆర్బీఐ ప్రధాన ఉద్దేశమన్నారు. పొదుపు, రుణ సదుపాయాలు, బీమా, పెన్షన్, డిజిటల్ చెల్లింపులు ఏ విధంగా పొందాలో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ జరిగినప్పుడు వెంటనే 1930 నంబరు సమాచారాన్నందించి డబ్బులు తిరిగి పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం అనంతి, గుంటూరు రవికుమార్, బ్యాంకు సిబ్బంది, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్