BREAKING
సొసైటీ ఎన్నికలకు పటిష్ట చర్యలు రంగురంగుల డ్రెస్‌లో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ విందు, లేటెస్ట్ ఫోటోలు వైరల్ వివిధ అంశాలలో  విద్యార్థులకు  పోటీలు తూర్పు నాయుడుపాలెం గ్రామ సర్పంచిగా ఏకగ్రీవమైన దామచర్ల విజయలక్ష్మి. మెగాస్టార్ చిరు లీక్స్, కాకా చిత్రంలో అనస్వర రాజన్ పాత్ర రహస్యం బట్టబయలు తాటిపాకలో గ్యాస్ కలకలం హౌస్ పల్లిలో ఘనంగా సదర్ సమ్మేళన వేడుకలు మలయాళ యువ హీరో నస్లెన్‌కు సూర్య ఊహించని కానుక, సినిమా విజయంతో లక్షల విలువైన కార్టియర్ వాచ్ బహుమతి ఈ విజయం ప్రజలకే అంకితం : రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు ఓటీటీలో విజయ్ ఆంటోని కొత్త క్రైమ్ థ్రిల్లర్, సంచలన మర్డర్ మిస్టరీతో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మార్గాన్ టాయిలెట్ల సమస్యను పరిష్కరించరా...! -అధికారుల తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం -విద్యార్థులు నరకం అనుభవిస్తున్నా అధికారులకు పట్టదా... కంబదూరులో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి. ఎస్సై గోపి. సల్మాన్ ఖాన్ మరో పెద్ద మనసు, మాతృభూమి సినిమా నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ఖరీదైన గడియారాలు బహుమతిగా ఇచ్చిన స్టార్ హీరో బ్యాడ్మింటన్ లో ఎస్వీయూ విద్యార్థి ప్రతిభ

నేటి నుండి రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ -- జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Select Suryaa Now
నేటి నుండి రెండో విడత పంచాయతీ ఎన్నికలకు  నామినేషన్ల స్వీకరణ  -- జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం, మేజర్ న్యూస్ పశ్చిమగోదావరి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నవంబరు 18వ తేదీ నుంచి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోని అత్తిలి, ఇరగవరం, పెంటపాడు, తాడేపల్లిగూడెం, తణుకు మండలాలతో పాటు గణపవరం మండలంలో ఈ నెల 29వ తేదీన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపారు.

ఈ విడతలో మొత్తం 121 గ్రామ పంచాయతీలకు, 1,288 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి 1,372 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. సంబంధిత ప్రాంతాల ప్రజలు ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొని, తమ ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు, భయాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.