BREAKING
ఈ విజయం ప్రజలకే అంకితం : రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు ఓటీటీలో విజయ్ ఆంటోని కొత్త క్రైమ్ థ్రిల్లర్, సంచలన మర్డర్ మిస్టరీతో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మార్గాన్ టాయిలెట్ల సమస్యను పరిష్కరించరా...! -అధికారుల తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం -విద్యార్థులు నరకం అనుభవిస్తున్నా అధికారులకు పట్టదా... కంబదూరులో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి. ఎస్సై గోపి. సల్మాన్ ఖాన్ మరో పెద్ద మనసు, మాతృభూమి సినిమా నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ఖరీదైన గడియారాలు బహుమతిగా ఇచ్చిన స్టార్ హీరో బ్యాడ్మింటన్ లో ఎస్వీయూ విద్యార్థి ప్రతిభ నేటి నుండి రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ -- జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు -- డిఇఓ వెంకట లక్ష్మమ్మ వెల్లడి జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎస్వీజేసీ విద్యార్ధి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డార్క్ వెబ్ సిరీస్ రివ్యూ, థ్రిల్లర్‌గా మారిన ప్రసిద్ధ కాలేజ్ ఫ్రాంచైజీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ పై అవగాహన తెలుగు సినిమాలకు శ్రీలీల దూరం కావడానికి అసలు కారణం అదే, ముంబైలో మెడికల్ ఇంటర్న్‌షిప్ వల్లే సినిమాలకు విరామం కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు -- డిఇఓ వెంకట లక్ష్మమ్మ వెల్లడి

Select Suryaa Now
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు -- డిఇఓ వెంకట లక్ష్మమ్మ వెల్లడి

ఏలూరు, నవంబర్, 17 : ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటలక్ష్మమ్మ  చెప్పారు. స్థానిక జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మంగళవారం పత్రికా విలేఖరుల సమావేశంలో డీఈఓ వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ   జిల్లాలో జననాల రేటు తక్కువగా ఉండడం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉందని,  వివిధ తరగతులలో విద్యార్థుల నమోదు సంఖ్యలో వ్యత్యాసాలకు జనాభా మార్పులు, పాఠశాల స్థాయిలో విద్యార్థుల లభ్యత వంటి అంశాలు కూడా కారణమవుతున్నాయన్నారు.  రాబోయే విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, 2027, మార్చి నెల నుండి 'బడి పిలుస్తోంది' కార్యక్రమం ద్వారా  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ప్రభుత్వ పధకాలు, ఉచిత పుస్తకాలు పంపిణీ, డిజిటల్ తరగతి గదులు, ల్యాబ్ లు, వంటి సౌకర్యాలు గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు ముందుగానే ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు.  ఇందులో భాగంగా మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు మరియు సమగ్ర శిక్ష నిబ్బంది సమన్వయంతో బడిబయట ఉన్న పిల్లలను గుర్తించడం, తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేలా ప్రోత్సహించడం, ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలు, నాణ్యమైన విద్య మరియు ఇతర ప్రయోజనాలపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామన్నారు.  ప్రతి విద్యా సంవత్సరంలో కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, మండల మరియు పాఠశాల స్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంపొందించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఈఓ వెంకటలక్షమ్మ తెలియజేసారు