పూజ్యబాపూజీ కన్నకలలు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం --కలిసికట్టుగా పనిచేసి గ్రామపంచాయతీలు నూరుశాతం ఫలితాలు సాధించాలి --రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి
విజయవాడ/నూజివీడు,నవంబరు 17: విజయవాడ తాడిగడప మంత్రివర్యులు క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నియోజకవర్గ కూటమిపార్టీశ్రేణులు, కార్యకర్తలతో గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచెయ్యాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. మండలాలు, గ్రామాలు వారీగా సమన్వయం, ప్రచారవ్యూహాలుపై విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గం నాలుగు మండలాల్లో అన్ని గ్రామ పంచాయతీలు నూరుశాతం ఫలితాలు సాధించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రెండున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు కూటమిపార్టీ ఐక్యతవల్లే స్థానిక సంస్థల్లో ఇప్పటివరకు ఘనవిజయాలు సాధించామని అన్నారు.ఇదే స్ఫూర్తితో గ్రామ పంచాయతీలు ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని, ఎక్కడా విభేదాలకు తావులేకుండా కలిసికట్టుగా ప్రతి ఓటరును కలసి మద్దతును కూడగట్టాలని మంత్రి కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు, చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రతి గడపకూ వివరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలు భాగస్వామ్యంతో స్థానిక సంస్థలు పాలనను బలోపేతం చయ్యడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూటమిపార్టీ బలపరిచిన అభ్యర్థులు నూరుశాతం ఘనవిజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పార్టీశ్రేణులకు సూచించారు. రాజకీయ, వ్యక్తిగత విమర్శలు మనకు వద్దని అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా ప్రతి ఇంటికి, ప్రతి ఓటరును కలిసి సంపూర్ణ మద్దతును పొంది ప్రజలు నుండి ఆశీస్సులు పొందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమికిపార్టీశ్రేణులు, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.