సర్పంచ్ అభ్యర్థులుగా 153 మంది నామినేషన్లు
నర్సాపురం రూరల్, మేజర్ న్యూస్ : మండలంలోని 28 గ్రామపంచాయతీలలో ఈనెల 26న జరగనున్న ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు 153 మంది నామినేషన్లు వేశారు. మూడు రోజులపాటు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్లను స్వీకరించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పరిశీలన, విత్డ్రాల్ అనంతరం ఎంతమంది బరిలో ఉంటారో అన్నది తేలాల్సి ఉంది.