BREAKING
వివిధ అంశాలలో  విద్యార్థులకు  పోటీలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు -- డిఇఓ వెంకట లక్ష్మమ్మ వెల్లడి జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎస్వీజేసీ విద్యార్ధి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డార్క్ వెబ్ సిరీస్ రివ్యూ, థ్రిల్లర్‌గా మారిన ప్రసిద్ధ కాలేజ్ ఫ్రాంచైజీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ పై అవగాహన తెలుగు సినిమాలకు శ్రీలీల దూరం కావడానికి అసలు కారణం అదే, ముంబైలో మెడికల్ ఇంటర్న్‌షిప్ వల్లే సినిమాలకు విరామం కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా.. బ్యాడ్మింటన్ లో చిన్నారుల షటిల్ యుద్ధం -ఫైనల్స్ లో హోరాహోరీ పోరులో విశాఖ హవా కలిసికట్టుగా సాగుతారా కత్తులు దూస్తారా! కూటమి ఐక్యతపైనే అందరి దృష్టి! వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ పై అందరి ధీమా.. గుమ్మగట్ట కేజీబీవీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 40 మంది బాలికలకు అస్వస్థత. ఘటన స్థలానికి ఆర్డిఓ వసంత బాబు. ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు సర్పంచ్ అభ్యర్థులుగా 153 మంది నామినేషన్లు అన్వేషణ సౌత్ జోన్ విజేతలకు అభినందన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా.. 19 నుంచి అమలు: చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించండి

Select Suryaa Now
కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించండి

నేటి దినపత్రిక సూర్య బ్యూరోరాజమహేంద్రవరం :

నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పాత 47వ డివిజన్ (ప్రస్తుత 68వ డివిజన్)లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి బేసరి కమలాదేవికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా కూటమి మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవికి మద్దతుగా కూడా ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. స్థానిక నాయకులు, కూటమి పార్టీల కార్యకర్తలతో కలిసి డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.. కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా స్థానికులతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ముఖ్యంగా ఈ డివిజన్‌లో మంజూరైన నిధులు, పూర్తయిన పనులు, కొనసాగుతున్న పనులు, త్వరలో ప్రారంభించనున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు వివరించారు. పాత 47వ డివిజన్ అభివృద్ధికి సంబంధించి ముద్రించిన ప్రచార కరపత్రాన్ని ప్రజలకు అందించారు. డివిజన్ లో ఇప్పటికే రూ.22.68 లక్షల విలువైన పనులు పూర్తయ్యాయని... మరో రూ.2.90 లక్షల విలువైన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయన్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మెథడ్ నిధుల నుంచి రూ.25.19 లక్షలు, యూ ఐ డి ఎఫ్ నిధుల నుంచి రూ.149 లక్షలు కలిపి మొత్తం రూ.174.19 లక్షలు (సుమారు రూ.1.74 కోట్లు) ఉన్నాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా నిధుల మంజూరు, పనుల ప్రారంభం, నిర్మాణాల పూర్తి దిశగా కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. నగరవ్యాప్తంగా గత రెండున్నరేళ్ల కూటమి పాలనలో సుమారు రూ.604 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, స్థానిక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించడం, అభివృద్ధి ఫలాలను ప్రతి కుటుంబానికి అందించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ డివిజన్‌లోనూ మంజూరైన నిధులతో చేపట్టనున్న మిగిలిన పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

నగర అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలంటే ప్రజాప్రతినిధులు, ప్రజల మధ్య సమన్వయం ఎంతో అవసరమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక సమస్యలపై అవగాహన కలిగి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని కోరారు. డివిజన్ అభివృద్ధికి మరింత వేగం తీసుకురావాలంటే కార్పొరేటర్‌గా బేసరి కమలాదేవిని, మేయర్‌గా రేలంగి శ్రీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రెండున్నరేళ్లుగా నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనించాలని, అభివృద్ధి ప్రస్థానానికి ఎన్నికల్లో తమ మద్దతు తెలియజేయాలని కోరారు. స్థానిక నాయకులు, కూటమి పార్టీల శ్రేణులు, మహిళలు, కార్యకర్తలు ఈ ప్రచార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.