BREAKING
వివిధ అంశాలలో  విద్యార్థులకు  పోటీలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు -- డిఇఓ వెంకట లక్ష్మమ్మ వెల్లడి జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎస్వీజేసీ విద్యార్ధి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డార్క్ వెబ్ సిరీస్ రివ్యూ, థ్రిల్లర్‌గా మారిన ప్రసిద్ధ కాలేజ్ ఫ్రాంచైజీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ పై అవగాహన తెలుగు సినిమాలకు శ్రీలీల దూరం కావడానికి అసలు కారణం అదే, ముంబైలో మెడికల్ ఇంటర్న్‌షిప్ వల్లే సినిమాలకు విరామం కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా.. బ్యాడ్మింటన్ లో చిన్నారుల షటిల్ యుద్ధం -ఫైనల్స్ లో హోరాహోరీ పోరులో విశాఖ హవా కలిసికట్టుగా సాగుతారా కత్తులు దూస్తారా! కూటమి ఐక్యతపైనే అందరి దృష్టి! వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ పై అందరి ధీమా.. గుమ్మగట్ట కేజీబీవీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 40 మంది బాలికలకు అస్వస్థత. ఘటన స్థలానికి ఆర్డిఓ వసంత బాబు. ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు సర్పంచ్ అభ్యర్థులుగా 153 మంది నామినేషన్లు అన్వేషణ సౌత్ జోన్ విజేతలకు అభినందన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా.. 19 నుంచి అమలు: చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

ఎన్డీఏ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా షంషూర్ నామినేషన్

Select Suryaa Now
ఎన్డీఏ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా షంషూర్ నామినేషన్

పామూరు, మేజర్ న్యూస్ : 

పామూరు పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా షేక్.షంషూర్ నామినేషన్ దాఖలు చేశారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో బలపరిచిన ఆయన మంగళవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారి రామారావుకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలకు చెందిన మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మూడు పార్టీల నాయకులు, శ్రేణుల సమక్షంలో షంషూర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్న టిడిపి యువ నాయకుడు మాజీ ఉపసర్పంచ్ యాదాల వెంకట సాయి కిరణ్, టిడిపి నియోజకవర్గ సీనియర్ నాయకులు కొప్పల్లి సురేష్, శ్రీనివాసులు, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బైరెడ్డి జయరామిరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు ఉప్పలపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.