BREAKING
వివిధ అంశాలలో  విద్యార్థులకు  పోటీలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు -- డిఇఓ వెంకట లక్ష్మమ్మ వెల్లడి జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎస్వీజేసీ విద్యార్ధి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ డార్క్ వెబ్ సిరీస్ రివ్యూ, థ్రిల్లర్‌గా మారిన ప్రసిద్ధ కాలేజ్ ఫ్రాంచైజీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ పై అవగాహన తెలుగు సినిమాలకు శ్రీలీల దూరం కావడానికి అసలు కారణం అదే, ముంబైలో మెడికల్ ఇంటర్న్‌షిప్ వల్లే సినిమాలకు విరామం కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా.. బ్యాడ్మింటన్ లో చిన్నారుల షటిల్ యుద్ధం -ఫైనల్స్ లో హోరాహోరీ పోరులో విశాఖ హవా కలిసికట్టుగా సాగుతారా కత్తులు దూస్తారా! కూటమి ఐక్యతపైనే అందరి దృష్టి! వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ పై అందరి ధీమా.. గుమ్మగట్ట కేజీబీవీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 40 మంది బాలికలకు అస్వస్థత. ఘటన స్థలానికి ఆర్డిఓ వసంత బాబు. ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు సర్పంచ్ అభ్యర్థులుగా 153 మంది నామినేషన్లు అన్వేషణ సౌత్ జోన్ విజేతలకు అభినందన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా.. 19 నుంచి అమలు: చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

ఏపీపీ కే సునీల్ కుమార్ బలమైన వాదనలు

Select Suryaa Now
ఏపీపీ కే సునీల్ కుమార్ బలమైన వాదనలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

భార్యను కాపురానికి పంపడం లేదన్న కక్షతో అత్తమామలు, భార్యను దారుణంగా హత్య చేసిన వ్యక్తికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో బాధితుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. సునీల్ కుమార్ న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యాధారాలను సమర్థంగా వినిపించడంతో నేరం రుజువైంది. దీంతో ముగ్గురి హత్య కేసులో జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా, భార్య వదినపై హత్యాయత్నం చేసిన కేసులో మరో పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ రామచంద్రపురం 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బి.హెచ్.వి. లక్ష్మీకుమారి మంగళవారం తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే.. అంబటి కృష్ణంరాజు అనే వ్యక్తి తన భార్య అంబటి ప్రేమావతి, అత్తమామలు బద్దా అబ్బాయి, బద్దా కమలలను కాపురానికి పంపడం లేదన్న కారణంతో చంపుతానని గతంలో బెదిరించాడు. ఈ క్రమంలో 2013 ఆగస్టు 12, 13 తేదీల మధ్య రాత్రి సుమారు 2 గంటల సమయంలో కేశవరం శ్రీ వెంకటలక్ష్మి రైస్ మిల్లు ఆవరణలోని నివాస ప్రాంతంలో నిద్రిస్తున్న భార్య, అత్తమామల తలలపై ఇనుపరాడ్డుతో బలంగా కొట్టి హత్య చేశాడు. అదే సమయంలో భార్య పక్కన నిద్రిస్తున్న ఆమె అన్నయ్య భార్య (వదిన)పై కూడా ఇనుపరాడ్డుతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం వారు మరణించారని భావించి, భార్య పక్కన ఉన్న కుమారుడిని తీసుకెళ్లి తన తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన భార్య వదిన ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై భార్య అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్సై ఎన్. లక్ష్మణస్వామి కేసు నమోదు చేయగా, సీఐ పి.వి. రమణ దర్యాప్తు నిర్వహించి నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ముగ్గురి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, భార్య వదినపై హత్యాయత్నం కేసులో పదేళ్ల కఠిన కారాగార శిక్ష, మరో రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ కేసులో బాధితుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. సునీల్ కుమార్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. కోర్టు లైజన్ హెడ్ కానిస్టేబుల్ కె.వి. రాఘవులు, మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై సతీష్ సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు, పర్యవేక్షణలో కీలకంగా వ్యవహరించిన మండపేట రూరల్ సీఐ పి. దొరరాజును ఉన్నతాధికారులు అభినందించారు.