టీయూడబ్ల్యూజే హెచ్-143 తాండూరు నియోజకవర్గ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
తాండూరు,మేజర్ న్యూస్: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే హెచ్-143) తాండూరు నియోజకవర్గ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మంగళవారం తాండూరు పట్టణంలోని హిమాలయ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఎన్నికల్లో నియోజకవర్గ అధ్యక్షుడిగా మొగులయ్య (ఉదయం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ప్రధాన కార్యదర్శి ప్రహ్లాద చారి, ఉపాధ్యక్షుడు జావిద్ హుస్సేన్, జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆసిఫ్ హుస్సేన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మొగులయ్య (ఉదయం), ఉపాధ్యక్షుడిగా మునీర్ మున్సిఫ్, ప్రధాన కార్యదర్శిగా అనంతయ్య, సహాయ కార్యదర్శిగా నాగేందర్, కోశాధికారిగా పర్యాద కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. అదేవిధంగా తాండూరు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా రూప్ సింగ్ (సీవీఆర్ న్యూస్), యాలాల మండల ప్రధాన కార్యదర్శిగా వీరేంద్ర ప్రసాద్ (ఎన్-9 న్యూస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే హెచ్-143 కార్యవర్గ సభ్యులు, వివిధ నియోజకవర్గాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.