BREAKING
సర్పంచ్ అభ్యర్థులుగా 153 మంది నామినేషన్లు అన్వేషణ సౌత్ జోన్ విజేతలకు అభినందన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా.. 19 నుంచి అమలు: చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ సంచలన నిర్ణయం, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చిత్రంలో పవర్‌ఫుల్ విలన్‌గా నటన రేపటి నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ -షెడ్యూల్ విడుదల చేసిన ఓఏమ్ డిసీ గణనీయంగా తగ్గిన రబీ సాగు విస్తీర్ణం కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించండి పూజ్యబాపూజీ కన్నకలలు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం --కలిసికట్టుగా పనిచేసి గ్రామపంచాయతీలు నూరుశాతం ఫలితాలు సాధించాలి --రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఐసీసీ భారీ జరిమానా, స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లకు షాక్ రైతులకు సకాలంలో పారదర్శకంగా ఎరువులు అందిస్తాం ఏపీపీ కే సునీల్ కుమార్ బలమైన వాదనలు ఎన్డీఏ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా షంషూర్ నామినేషన్ అప్పు చెల్లించలేదని ఇంటికి నిప్పు.. ఇల్లంతా దగ్ధం. షంషూర్ నామినేషన్‌కు పోటెత్తిన కూటమి శ్రేణులు ఐపీఎల్ 2027 మినీ వేలం, ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా విడుదల

తిరుపతి విద్యార్థులకు అరుదైన గౌరవం -రాష్ట్రపతితో ముఖాముఖి...విద్యార్థులకు ప్రశంసల వెల్లువ

Select Suryaa Now
తిరుపతి విద్యార్థులకు అరుదైన గౌరవం -రాష్ట్రపతితో ముఖాముఖి...విద్యార్థులకు ప్రశంసల వెల్లువ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : బాలల దినోత్సవం సందర్భంగా తిరుపతికి చెందిన బి.జి.ఎస్.విజ్ఞాతం పాఠశాల విద్యార్థులకు అరుదైన గౌరవం దక్కింది. ఈనెల 14వ తేదీ ఆ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ అరుదైన అవకాశాన్ని బిజియస్ విజ్ఞాపం పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని బి.యామిని ప్రియ, ఏడో తరగతి విద్యార్థి పి.లహితీష్ నాయక్ సొంతం చేసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించి, వారి అభిరుచులు, ఆలోచనలు, భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని సూచిస్తూ వారిలో స్ఫూర్తి నింపారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతిని నేరుగా కలుసుకుని, ఆమెతో తమ అభిప్రాయాలను పంచుకోవడం విద్యార్థులకు జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతిగా నిలిచింది. రాష్ట్రపతి అందించిన ప్రోత్సాహం, విలువైన సూచనలు తమ భవిష్యత్తు లక్ష్యాల సాధనకు ఎంతో దోహదపడతాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీశ్రీశ్రీ నిర్మలానందనాథ స్వామీజీ ఆశీస్సులు, మార్గదర్శకత్వంతో ఈ విశిష్ట కార్యక్రమం సాకారమైంది. పాఠశాల డైరెక్టర్ రవిచంద్ర ప్రత్యేక ప్రోత్సాహం, ప్రిన్సిపాల్ సరిత అరబి నేతృత్వంలో విద్యార్థులకు ఈ అరుదైన అవకాశం లభించింది. విద్యార్థుల్లో పుస్తక జ్ఞానంతో పాటు నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సామాజిక బాధ్యత, ఉన్నత ఆశయాలను పెంపొందించడమే లక్ష్యంగా బి.జి.ఎస్. విజ్ఞాతం పాఠశాల నిరంతరం కృషి చేస్తోందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. రాష్ట్రపతితో విద్యార్థుల ఈ ప్రత్యేక భేటీ పాఠశాలకే కాకుండా తిరుపతి విద్యారంగానికి కూడా గర్వకారణంగా నిలిచింది.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్